YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆళ్లకు బిగిస్తున్న ఉచ్చు

ఆళ్లకు బిగిస్తున్న ఉచ్చు

అవినీతి పోలీస్‌ డీఎస్పీ హరిప్రసాద్‌ ఇంట్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన భార్య పేరిట ఉన్న ఆస్తుల పత్రాలు దొరకడానికి సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెండో సారి కూడా డుమ్మా కొట్టారు.. ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టిన ఆళ్ల, ఈసారి కూడా తన బదులు, ఏసీబీ ఎదుటకు, ఆళ్ల తరపు లాయర్లనే హాజరుపరిచారు. శస్త్ర చికిత్స కారణంగా ఎమ్మెల్యే ఆర్కే హాజరుకాలేకపోయారని ఏసీబీకి లాయర్లు వివరణ ఇచ్చారు. పోయిన మంగళవారం మొదటి సారి విచారణకు హాజరు కావాల్సి ఉంది.. అయితే, ఆళ్ల మంగళవారం గైర్హాజరయ్యారు. ‘మా క్లయింట్‌కు ఆరోగ్యం బాగలేదు.. ఆయన తరపున మేం వచ్చాం.. రెండు వారాలు గడువు కావాలి’ అని ఆయన తరపున న్యాయవాదులు ఏసీబీని కోరారు.‘రెండు వారాలు సాధ్యం కాదు.. ఒక వారం ఇస్తాం.. 29న తప్పనిసరిగా హాజరవ్వాలి’ అని అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ రోజు కూడా లాయర్లు వచ్చి, మా క్లయింట్‌కు ఆరోగ్యం ఇంకా కుదుట పాడలేదు అని చెప్పారు. రాజధాని ప్రాంతంలో అత్యంత అవినీతిపరుడిగా ఆరోపణలున్న పోలీసు అధికారి దుర్గాప్రసాద్‌పై గతేడాది జనవరిలో ఏసీబీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. ఏసీబీకి ఫిర్యాదులు అందడంతో ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ (సీఐయూ)ను రంగంలోకి దించారు. దర్యాప్తులో భాగంగా తుళ్లూరు ప్రాంతంలో కొన్ని స్థిరాస్తులు ఇతరుల పేర్లతో ఉన్నట్లు బయటపడింది. ఆరా తీయగా డీఎస్పీ బినామీల్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భార్య ఉన్నట్లు తేలింది.ఎమ్మెల్యే భార్య పేరుతో ఉన్న ఆస్తుల పత్రాలు డీఎస్పీ ఇంట్లో లభించడంతో ఏసీబీ అధికారులు ఆయనకు నోటీసు ఇచ్చారు. ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్న అవినీతిపరులకు కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారని ఈ సంఘటనలు చూస్తే తెలుస్తుంది. క్రికెట్‌ బెట్టింగ్‌లతో జనాన్ని కొల్లగొడుతోన్న బుకీలకు నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అండగా నిలిచారని ఆ జిల్లా ఎస్పీ ఇచ్చిన నివేదిక ఇటీవల సంచలనం సృష్టించింది. నిన్న అనంతపురంజిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్న కుమారుడు కాంట్రాక్టరును డబ్బు కోసం కిడ్నాప్‌ చేయడం.. తాజాగా ఏసీబీ కేసు దర్యాప్తులో గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర వెలుగులోకి వచ్చాయి

Related Posts