న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23,
భారత ప్రభుత్వం ఏదో చేస్తోంది. రహస్యంగా ఏదో ప్రిపరేషన్ జరుగుతోంది. అత్యవసరంగా రూ.85 వేల కోట్లను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయుధాల కొనుగోలుకు రిలీజ్ చేసింది. అంటే ఏ దేశమైనా(పాకిస్తాన్, చైనా) భారత్‌పై ఏమైనా దాడి చేయబోతున్నాయా? అందుకోసమే భారత్ అత్యవసరంగా ఆయుధాలు కొనుగోలు చేసిందా అన్న సందేహాలు వ్యక్తముతున్నాయి.భారత్, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఒకవైపు ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్‌లో అల్లకల్లోలం కొనసాగుతోంది. మొన్నటి పాకిస్తాన్ ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్ పార్టీ మద్దతుదారుల గెలిచారు. కానీ నవజాజ్‌షరీఫ్, భుట్టోవాళ్ల పార్టీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. దీంతో సివిల్ వార్ తప్పదన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు సైన్యం కూడా తిరుగుబాటు చేస్తుందని ప్రచారం జరుగుతోందిపాకిస్తాన్‌లో మరోవైపు ప్రజల తిరుగుబాటు కొనసాగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిల్టిస్తాన్ ప్రాంతంలో, బెలుచిస్తాన్ ప్రాంతంలో ప్రజలు ఇప్పటికే పాలకులపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు వివిధ సంస్థలు కూడా తిరుగుబాటు ఆలోచనలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు తాము కశ్మీర్‌లో కలుస్తామని డిమాండ్ చేస్తున్నారు. బెలుచిస్తాన్, బాల్టిస్తాన్ ప్రాంతంలో కూడా భారత్‌లో కలవాలన్న ఆలోచన మొదలైంది.ఇదిలా ఉంటే.. కేంద్రం పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయుధాలు కొనుగోలు చేయడం, అదీ అత్యవసరంగా కొనుగోలు చేయడం చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ కోసమే కేంద్రం మరోమారు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నికల ముందే సైన్యం కొన్ని యుద్ధాలు చేసింది. ఈ క్రమంలో మోదీ సర్కార్ మరేదైనా ప్లాన్ సిద్ధం చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది.