YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గంజాయి స్మగ్లర్లకు పైలట్లు

గంజాయి స్మగ్లర్లకు పైలట్లు

విశాఖపట్టణం, ఫిబ్రవరి 24 
గంజాయి స్మగ్లర్లు కూడా తమకు పైలట్లను పెట్టుకుంటున్నారు. పోలీసులు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారుల నిఘా పెరగడంతో.. తమ రూట్ కు అడ్డు లేకుండా ప్రయాణం సాఫీగా సాగేందుకు ఎస్కార్ట్ లతో రూట్ క్లియర్ చేసుకుంటున్నారు . కొన్ని వాహనాలను ముందు పంపి.. ఆ తర్వాత వెనుక మరో వాహనంలో సరుకుతో వెళ్ళిపోతున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఐడియాలతో వెళ్తున్న గంజాయి స్మగ్లర్లకు పోలీసులు., సెబ్ అధికారులు చెక్ చెబుతున్నారు. తాజాగా అరకు సుంకరమెట్ట జంక్షన్ లో.. కంటైనర్ లో గంజాయి తో పాటు… పైలట్గా వెళుతున్న ఓ బుల్లెట్‌ను, కారును కూడా సీజ్ చేశారు. కారులోను మరికొంత గంజాయిని పట్టుబడింది.సిఐ రుద్ర శేఖర్ వివరాల ప్రకారం… అల్లూరి జిల్లా అరకులోయ పోలీసులకు కీలక సమాచారం అందింది. సుంకరి మెట్ట జంక్షన్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ లోగా ఒక బుల్లెట్ వస్తోంది. మరి కొద్దిసేపటికి కారు వచ్చింది. ఆపి తనిఖీ చేసేసరికి కారులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. ఆ వెనకే మరో కంటైనర్ లారీ వస్తుంది. అందులో చెక్ చేస్తే మరికొంత గంజాయి కూడా బయటపడింది. 150 కిలోల గంజాయి రెండు వాహనాల్లో తరలిస్తూ ఉండగా పట్టుకున్నారు పోలీసులు . యూపీకి చెందిన ఇద్దరితో పాటు నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. కంటైనర్ లారీని, ఒక కారును, ఒక బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు.గంజాయి స్మగ్లర్లు సరుకు తరలించేందుకు.. సరికొత్త ఐడియాలను ఉపయోగిస్తున్నారు. తాజాగా పట్టుబడిన కేసులో కారు, కంటైనర్ లో గంజాయి తరలించేందుకు ముందుగా.. బుల్లెట్ ను రూట్ క్లియర్ చేసేందుకు పంపినట్టు గుర్తించారు పోలీసులు. పక్కా ప్లాన్ తో మూడు వాహనాలను పట్టుకుని నలుగురిని కటకటాల వెనక్కు నెట్టారు. ఒరిస్సాలో కొనుగోలు చేసిన గంజాయిని అల్లూరి జిల్లా మీదుగా మైదాన ప్రాంతానికి తరలించి అక్కడ నుంచి యూపీకి తరలించేందుకు స్మగ్లర్లు ప్లాన్ చేసినట్టు సీఐ రుద్ర శేఖర్ తెలిపారు. ఎన్నికల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో నిఘా మరింత ముమ్మరం చేస్తామని.. ఇప్పటికే గంజాయి స్మగ్లర్లు ఇటీవల పట్టుబడిన నేరస్తుల వివరాలతో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు. గంజాయితో పాటు ఒరిస్సా నుంచి వచ్చే మద్యం, ఇతర అనైతిక కార్యకలాపాలకు చెప్తామని అంటున్నారు పోలీసులు.

Related Posts