సూపర్ స్టార్ రజనీకాంత్ లోని రాజకీయ నాయకుడిని బయటకు రపించింది తూత్తుకుడిలో జరిగిన ఘటన. తూత్తుకుడిలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన రజనీకాంత్. పోలీసుల కాల్పులను తీవ్రంగా ఖండించిన రజనీకాంత్. బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పిన రజనీ, 'కాలా' ప్రమోషన్ నిమిత్తం ముందుగా అనుకున్న హైదరాబాద్, ముంబై టూర్ ను రద్దు చేసుకున్నారు. ఇదిలావుండగా, కొందరు బాధితులు రజనీ పర్యటనను వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది.