YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మేడారంలో ట్రాఫిక్ జాం!

మేడారంలో ట్రాఫిక్ జాం!

ములుగు
మేడారం లో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది.జాతరకు వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. తాడ్వాయి నుండి మేడారం వరకు గల కీకారణ్యంలో ట్రాఫిక్  ఆగిపోయింది. నీళ్లు లేక   పిల్లలు, పెద్దలు నానా యాతన పడ్డారు. జాతరకు ఆరువేల బస్సులు కేటాయించడం,  మహిళలకు ప్రీ బస్సు సౌకర్యంతో ఈ సారి జాతరకు జనాలు పోటెత్తారు. భక్తులను రద్దిని బట్టి క్లియర్ చేయడంలో అధికారులు విఫలం చెందారు.  శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెఢ్డి, గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్,కేంద్ గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా పర్యటించడంతో భక్తుల దర్శనానికి ఆలస్యమయింది. వారంతా  పొద్దుపోయిన తర్వాత మేడారం బయలు దేరారు. భక్తులు తిరుగు ప్రయాణంలో ఉండాల్సిన భక్తులు కుడా పెద్ద సంఖ్యలో వుండడంతో ట్రాఫిక్ జాం అయిందని తెలుస్తున్నది. 2012 సంవత్సరంలో 18 గంటలు ట్రాఫిక్ జాం అయి భక్తులు అరిగోస పడ్డారు. గతంలో సింగిల్ రోడ్డు,న్యారో కాల్వర్టులు ఉన్న కారణంగా ట్రాఫిక్ జాం అయింది.కానీ ఇప్పుడు డబుల్ రోడ్డులో నిర్మించినా గంటల తరబడి ట్రాఫిక్ జాం కావడం అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

Related Posts