YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గెలుపే లక్ష్యంగా అడుగులు

గెలుపే లక్ష్యంగా అడుగులు

హైదరాబాద్, ఫిబ్రవరి 24
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ పార్టీ ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణ లోనూ మరింత దూకుడు పెంచింది. తెలంగాణలో 10 రోజుల పాటు సాగే విజయ సంకల్ప్ యాత్రతో లోక్ సభ ఎన్నికల కోసం మొదటి దశ ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించి మంచి జోష్ మీద ఉంది. ఈ యాత్రను నాలుగు వేర్వేరు ప్రాంతాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు ఒకేసారి జెండా ఊపి ప్రారంభించి ప్రజల్లోకి వెళ్లారు.  హైదరాబాద్ లో జరిగే విజయ్ సంకల్ప్ యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనబోతున్నారు. అమిత్ షా రాకతో విజయ్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాలు చురుగ్గా సాగనున్నాయి. అయితే తొలి దశ ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించి బహిరంగ సభలో ప్రసంగించే అవకాశాలున్నాయి. అయితే తేదీ, స్థలం ఇంకా ఖరారు కాలేదు.ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో ఆకట్టుకునే స్ట్రైక్ రేట్ తో, బిజెపి తన ఓట్ల శాతాన్ని దాదాపు ఏడు శాతం మెరుగుపరుచుకుంది. లోక్ సభ ఎన్నికలకు ఓటర్ల ఆదరణ పరంగా బీజేపీ తమ ప్రత్యర్థులైన కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల కంటే చాలా ముందంజలో ఉందని చెప్పక తప్పదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 13.90 శాతం ఓట్లు సాధించి 8 అసెంబ్లీ సెగ్మెంట్లను గెలుచుకుంది. అదే ఊపుతో  మరిన్ని లోక్ సభ స్థానాలను కైవసం చేసుకోవాలనుకుంటుంది.లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందే ‘ముందస్తు ప్రచారం’ మైలేజ్ పొందడానికి   ‘విజయ్ సంకల్ప యాత్ర’ను ప్రారంభించింది. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్రమంత్రులు బీఎల్ శర్మ, పురుషోత్తం రూపాలా సహా పార్టీకి చెందిన ప్రముఖ జాతీయ నాయకులు ‘విజయ్ సంకల్ప్ యాత్రలను’ ప్రారంభించారు.  బీజేపీ రాష్ట్ర శాఖ తెలంగాణను ఐదు క్లస్టర్లుగా విభజించి ప్రతి క్లస్టర్ కు ‘స్టార్ లీడర్స్’ను కేటాయించి ఆయా ప్రాంతాల్లో ప్రచార యాత్రను నడిపించింది.ఉమ్మడి ప్రాజెక్టులను కేంద్ర నియంత్రణలో ఉన్న కేఆర్ఎంబీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇటీవల నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహించినప్పటికీ, చుట్టూ పెద్దగా కార్యకలాపాలు కనిపించడం లేదు. కాంగ్రెస్ కూడా పెద్దగా యాక్టివ్ గా లేదు. కానీ బీజేపీ సంకల్ప యాత్రతో ముందుంది. ఇక అయోధ్య రామమందిర లాంటి అంశాన్ని తీసుకొని తెలంగాణ బీజేపీ ప్రజల్లోకి వెళ్లి ఆకట్టుకోబోయే వ్యూహంలో ఉంది.

Related Posts