YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రుల వివాదం

మంత్రుల వివాదం
విశాఖలో మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు ల మధ్య విభేధాలు మరోసారి భగ్గుమన్నాయి. గత రెండు నెలల క్రితం విశాఖలో లైవ్ స్టాక్ ఏజెన్సీ కి సంభందించిన జిల్లా కమిటీని పశుగణాభివృద్ధి  సంస్థ జాయింట్ డైరెక్టర్ కోటేశ్వరరావు, ఈవో సూర్యప్రకాష్ లు నియమించి కలెక్టర్ తో ఉత్తర్వులు కూడా ఇప్పించారు. అధికారులు నియమించిన కమిటీలో తన వర్గం వారు లేకపోవటం తో పాటు గంటా అనుచరులు ఉండటం తో విషయం తెలుసుకున్న మంత్రి అయ్యన్న అధికారుల పై నిప్పులు చెరిగారు. ఆ సమయంలోనే అసెంబ్లీ జరుగుతుండటతో డిప్యూటీ సిఎం ను సైతం కలసి అధికారులు నన్ను అవమానిస్తున్నారు, నిర్ణయాలు తీసుకునే ముందు కనీసం సంప్రదించటం లేదు రాజీనామా చేస్తానంటూ పెద్ద దుమారమే లేపాడు. ఆ వివాదం చినికిచినికి గాలి వానలా మారటంతో కలెక్టర్ తాను ఇచ్చిన డిఎల్ ఎస్ ఏ కమిటీని రద్దు చేస్తూ క్షణాల మీద మరొక ఉత్తర్వు కూడా విడుదల చేశాడు. జరిగిన ఘటన పై మంత్రి ఆదేశం మేరకు జేడి కోటేశ్వరరావు, ఈవో సూర్యప్రకాష్ లను ప్రభుత్వానికి సరెండర్ చేయటం తో వివాదం ముగిసింది. అయితే సుమారు రెండు నెలల తరువాత ఇప్పుడు జేడి కోటేశ్వరరావు, ఈవో సూర్యప్రకాష్ లకు విశాఖలో పోష్టింగ్ ఇస్తూ సాధారణ పరిపాలన శాఖ మెమో విడుదల చేసింది. దీంతో మరోసారి మంత్రి అయ్యన్న అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. మంత్రి గంటా జోక్యంతోనే ఇదంతా జరిగిందని, తాను జిల్లా నుండి పంపిస్తే ప్రభుత్వం తిరిగి వారినే విశాఖకు ఎలా పంపిస్తారని ఉన్నతాధికారుల పై ఫైర్ అయ్యినట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ వ్యవహరం పై సంభంధిత మంత్రి ఆదినారాయణ రెడ్డి తో కూడా ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం

Related Posts