YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గత పాలకుల చిత్తశుద్ధి లోపం అభివృద్దికి నోచుకోని పటాన్ చెరు

గత పాలకుల చిత్తశుద్ధి లోపం అభివృద్దికి నోచుకోని పటాన్ చెరు

సంగారెడ్డి
పటాన్ చెరు మండలం ముత్తంగి లో బిజేపి జిల్లా అద్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి  దుబ్బాక మాజీ ఎమ్మెల్యే యం.రఘునందన్ రావు,  యెండల లక్ష్మీనారాయణ, బిజేపి సీనియర్ నేత సంగప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా బిజేపి నేత యం.రఘునందన్   పటాన్ చెరులోని పలు ఆంశాలపై స్పందించారు. ముఖ్యంగా  ఈదుల నాగుల పల్లిలో  రైల్వే టెర్మినల్ భూసేకరణ వద్దే ఆగిపోవటం విచారకరమన్నారు.  153 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణం సాధ్యమైనా  కొల్లూరు వద్ద కిలోమీటర్ సర్వీస్ రోడ్డును ఇవ్వలేకపోవటంపై నిప్పులు చెరిగారు.
స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ సర్వీస్ రోడ్డు నిర్మాణం పై లేదంటూ మండిపడ్డారు.
పటాన్ చెరు లో ఎన్నో చెరువులున్నా సిద్దిపేట కొమటిచెరువులా అభివృద్ధి చెందకపోవటం బాధాకరమన్నారు ఒక్క చెరువును కూడా మినీ ట్యాంక్ బండ్ కాలేదని ఎద్దేవా చేశారు.
పటాన్ చెరు లో గొప్ప లాండ్ బ్యాంకు ఉన్నా ఐటి సెజ్ డవలప్ చేయలేదని విమర్శలు సంధించారు. లక్డారంలో క్రషర్లు రూపంలో  గుట్టలను, కొండలను  కరిగించేశారని కొట్లాది రూపాయలు అక్రమంగా అర్జించారని ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డారు. . బిఆర్ఎస్ పార్టీ కి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని.రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బిజేపికే ప్రజలు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

Related Posts