YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

యక్సిడెంట్ టైంలో నా మైండ్ బ్లాంక్ అయ్యింది లాస్య నందిత పిఏ ఆకాష్

యక్సిడెంట్ టైంలో నా మైండ్ బ్లాంక్ అయ్యింది లాస్య నందిత పిఏ ఆకాష్

సంగారెడ్డి
రోడ్డు ప్రమాదంలో మరణించిన కంటోన్మెంట్  ఎమ్మెల్యే లాస్య  నందిత పిఎ ఆకాష్ స్టేట్మెంట్ ను పఠాన్ చేరు పోలీసులు  రికార్డు చేసారు. ఆకాష్ మేజిస్ట్రేట్ ముందు వాగ్మూలం ఇచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు అంటూ స్టేట్మెంట్ లో ఆకాష్ పేర్కోన్నాడు. లాస్య తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటు  వెళ్ళాం. దర్గా నుండి హైదరాబాద్ చేరుకొని, లాస్య కార్లో ఉన్న తన అక్క కూతుర్ని  ఇంకో కార్లో ఎక్కించి మేము పఠాన్ చేరు వైపు బయలుదేరాం.. యక్సిడెంట్ టైంలో నా మైండ్ బ్లాంక్ అయ్యిందని ఆకాష్ పేర్కోన్నాడు
డీఎస్పీ పఠాన్ చేరు సంజీవ రావుమాట్లాడుతూ ముందు వెళ్తున్న వాహన్నాని ఢీకొట్టి ఆ పై కారు కంట్రోల్ అవ్వక లెఫ్ట్ సైడ్ రైలింగ్ కు ఢీకొట్టారు. ప్రమాదం కంటే ముందే కార్ ముందు భాగాలు పగిలి కింద పడిపోయి ఉన్నాయి. నిర్లక్షం గా అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు.

Related Posts