YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె
దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు బుధవారం ఆందోళనబాట పట్టారు. వేతన సవరణతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు చెందిన 10 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఉద్యోగుల సమ్మెతో బ్యాంకులలో బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. గురువారం కూడా బ్యాంకు ఉద్యోగులు తమ సమ్మెను కొనసాగించనున్నారు. మొత్తం 9 బ్యాంక్ ఎంప్లాయి అసోసియేషన్లు సమ్మెలో పాల్గొంటున్నాయని బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీవోసీ) తెలియజేసింది. ఈ రెండు రోజుల పాటు ఏటీఎంలు కూడా పని చేయవని పేర్కొంది. ఈ నెల 5న జరిగిన వేతన సంప్రదింపుల సమావేశంలో 2017 మార్చి 31 నాటికి వేతన బిల్లు వ్యయంలో 2 శాతం పెంపును ఇస్తామని ఐబీఏ ముందుకురాగా, దీనికి యూనియన్లు అంగీకరించలేదు. ఇది చాలా తక్కువని అసంతృప్తిని వ్యక్తం చేశాయి. 2017 నవంబర్ నుంచి వేతనాల పున:సమీక్ష పెండింగ్లో ఉందని, వెంటనే వాటిని సమీక్షించాలని డిమాండ్ చేశాయి. 
చెక్కుల క్లియరెన్స్ మినహా ప్రైవేటు రంగంలోని ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ తదితర బ్యాంకులు మామూలుగానే పనిచేయనుండగా, భారత బ్యాంకింగ్ రంగంలో 75 శాతం వాటా ఉన్న 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు మూతపడ్డాయి. 

Related Posts