YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వై నాట్ 14 అంటున్న కాంగ్రెస్

వై నాట్ 14 అంటున్న కాంగ్రెస్

హైదరాబాద్, ఫిబ్రవరి 26
తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారబోతున్నాయి వచ్చే లోక్‌సభ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో పవర్‌లోకి వచ్చిన పార్టీ.. పార్లమెంట్ ఎలక్షన్స్‌లో మెజార్టీ సీట్లు సాధించి పట్టు తగ్గలేదని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిష్టానం కూడా కనీసం 14 సీట్లు అయినా గెలవాలని టి కాంగ్రెస్‌ నేతలకు టార్గెట్‌ పెట్టినట్టు తెలిసింది. ఆ క్రమంలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతి సభలోను 14 ఎంపీ సీట్లంటూ ప్రస్తావిస్తోంది. తెలంగాణలో మొత్తం 17 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మామూలుగా అయితే ఏ పార్టీ నేతలైనా.. ఆ ఊపులో చెప్పేటప్పుడు అన్ని సీట్లు గెలుచుకుంటామని అంటారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్‌ మాత్రం 14కే ఎందుకు ఫిక్స్‌ అయింది? అంటే మిగతా మూడు సీట్లలో గెలవలేమని ముందే ఫిక్స్‌ అయ్యారా?లేదంటే వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలని అనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆ వదిలేసిన మూడు సీట్లు ఏవన్న ప్రశ్న కూడా వస్తోంది పార్టీ వర్గాల్లో. ఓపెన్‌గా మాట్లాడుకుంటే… తెలంగాణలోని ఏ రాజకీయ పార్టీ అయినా… హైదరాబాద్‌ లోక్‌సభ సీటుకు అంత త్వరగా తమ లెక్కలోకి తీసుకోవు. అక్కడ ఎంఐఎంకి ఉన్న బలం దృష్ట్యా దాన్ని వదిలేసి చెబుతుంటాయి.పార్లమెంట్‌ ఎన్నికల టైంలో బీఆర్‌ఎస్‌ కూడా సారు, కారు, పదహారు అన్న నినాదాన్ని ఇచ్చిందే తప్ప 17 అనలేదు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ 16 అని కూడా అనకుండా 14కే ఎందుకు ఫిక్స్‌ అయిందన్న ప్రశ్నకు సమాధానం వెదుకుతున్నాయి రాజకీయ వర్గాలు. అలాగే మిగిలిన రెండు సీట్లు ఎవరికి వెళ్తాయని కాంగ్రెస్‌ భావిస్తోందన్న చర్చ సైతం జరుగుతోంది. ఈసారి బీఆర్‌ఎస్ ఒకటి లేదా రెండు సీట్లకే పరిమితం అవుతుందని తొలి నుంచి జోస్యం చెబుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. అటు బీజేపీ కూడా డబుల్‌ డిజిట్‌ టార్గెట్‌ అంటున్నా.. తక్కువలో తక్కువ ఐదారు ఎంపీ సీట్లు గెలుస్తామన్న ధీమాతో ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరెన్ని సీట్లు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఎక్కువ అన్నది మెయిన్‌ పాయింట్‌. అయినా కాంగ్రెస్‌ కనీసం 17కు పదహారు అనైనా అనకుండా 14 ఫిగర్‌కు ఫిక్స్‌ అవడం వెనక వాస్తవికత ఉందా.. లేక మొత్తం ఫిగర్‌ చెప్పడానికి ధైర్యం చాలడం లేదా అన్నది ఓపెన్‌ టాక్‌. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ఎంపీ సీట్ల చుట్టూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. జాతీయ పార్టీలతో పాటు బీఆర్‌ఎస్‌ కూడా మా వ్యూహాలు మాకున్నాయంటూ భారీగానే ఆశలు పెట్టుకుంది. చివరికి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చూడాలి.

Related Posts