YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బండి వర్సెస్ రుద్రసంతోష్

బండి వర్సెస్ రుద్రసంతోష్

కరీంనగర్, ఫిబ్రవరి 26
పార్లమెంటు ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరో పక్షం రోజుల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికా కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పోటీకి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్‌ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే దూకుడు ప్రదర్శించాలని చూస్తోంది. బీజేపీ కూడా ఊపుమీద ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడంతో సమరోత్సాహంతో ముందుకు సాగుతోంది. బీఆర్‌ఎస్‌ మాత్రమే అసెంబ్లీ ఓటమి నుంచి కోలుకోవడం లేదు. అయినా పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్‌ స్థానాలు నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇక లోక్‌సభ ఎన్నికల్లో అందరి చూపు కరీంనగర్‌పై ఉంది. సిట్టింగ్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయం. బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ప్రకటించారు. ఇక, అధికార కాంగ్రెస్‌కు అభ్యర్థి కరువయ్యాడు. పోటీకి ఇద్దరు ముగ్గురు దరఖాస్తు చేసుకున్నా.. బండి సంజయ్‌ను ఢీకొట్టే స్థాయి నాయకులు కాదు. జనానికి పెద్దగా పరిచయం కూడా లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం బలమైన నాయకుడి కోసం వేట మొదలు పెట్టింది రుద్ర సంతోష్‌ కుమార్‌ ఈ పేరు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఒక సెన్సేషన్‌గా మారింది. దశాబ్దకాలంగా కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో కీలకంగా వ్యవహరించారు. వార్‌ రూం ఇన్‌చార్జిగా పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎటర్‌ ఇవ్వబోతున్నారు. కరీంనగర్‌ లోక్‌సభలో బండి సంజయ్‌ను ఢీకొట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు కాంగ్రెస్‌ అధిష్టానం రుద్ర సంతోష్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.కరీంనగర్‌ పార్లమెంటు స్థానానికి రుద్ర సంతోష్‌ పేరు వినిపిస్తుండడంతో ఇపుపడు అందరి చూపు అతడినపై పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ అనుయాయుడిగా, కరీంనగర్‌ జిల్లాలో ఎమ్మెల్యేలు, నాయకులకు ఆప్తుడిగా ఉన్నారు రుద్ర సంతోష్‌. వివాద రహితుడిగా, అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో పాల్గొని వివిధ సమస్యలు రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లి ఆయన మనసు గెలుచుకున్నారు.ఏఐసీసీ అధ్యోఉడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ పెద్దల ప్రత్యేక చొరవతో సంతోష్‌ ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినటర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు అధిష్టానం ఆశీస్సులతో కరీంనగర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. దాదాపు టికెట్‌ ఆయనకే ఖరారు చేసినట్లు తెలుస్తోందిరుద్ర సంతోష్‌ బరిలో ఉంటే.. కరీంనగర్‌లో పోటీ బండి సంజయ్, రుద్ర సంతోష్‌ మధ్యే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌పై తెలంగాణలో వ్యతిరేకత ఉంది. జాతీయ పార్టీల మధ్యే పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌ నిర్వహించిన ఇంటర్నల్‌ సర్వేల్లో బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికే పరిమితమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts