YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎయిర్‌పోర్ట్‌లో భయానక వాతావరణం

ఎయిర్‌పోర్ట్‌లో భయానక వాతావరణం

 - సిస్టర్‌ అంటే పిస్టల్‌ అని ఎయిర్‌పోర్ట్‌ను వణికించాడు

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ, సీనియర్‌ నేత శశి థరూర్‌ మాటలను తప్పుగా అర్థం చేసుకొన్న ఓ వ్యక్తి ఎయిర్‌పోర్ట్‌లో భయానక వాతావరణం సృష్టించాడు. ప్రమాదపు అలారం మీట నొక్కి ఎయిర్‌పోర్ట్‌ అధికారులను కాసేపు పరుగులుపెట్టించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఢిల్లీ నుంచి వస్తున్న తన సోదరిని రిసీవ్‌ చేసుకునేందుకు జైపూర్‌ ఎయిర్‌పోర్ట్‌కు శశిథరూర్‌ వెళ్లారు. ఇదే విషయాన్ని థరూర్‌ మరో వ్యక్తితో అవతలి వ్యక్తికి చెప్పారు. 'వెయిటింగ్‌ ఫర్‌ సిస్టర్‌‌' అని థరూర్‌ అనగా ఆ మాటను 'వెయిటింగ్‌ ఫర్‌ పిస్టల్‌' అన్నట్లుగా మరో ప్రయాణీకుడు అర్థం చేసుకొన్నాడు.

వెంటనే ఈ మాటలు విని ప్యానిక్‌ బటన్‌ ప్రెస్‌ చేశాడు. ఎయిర్‌ పోర్ట్‌ భద్రతా సిబ్బందికి చెప్పి వారు చర్యలు తీసుకునేలా చేశాడు. అయితే, థరూర్‌ వద్దకు చేరుకున్న అధికారులు ఆయనను చూసి షాకయ్యారు. 'థరూర్‌ను మేం ఏమీ అనలేదు. ఆయన ఏ తుపాకీ కలిగి లేరు. ఆయన తన సోదరి కోసం మాత్రమే ఎదురు చూస్తున్నారు. ఆయనను ఎవరో ప్రశ్నించగా మై సిస్టర్‌ అని చెప్పారు. కానీ, సరిగా వినని మరో వ్యక్తి పిస్టల్‌ అనుకొని మాకు ఫిర్యాదు చేశాడు. వివరాలు తెలియడంతో ఆ విషయం అంతటితో ముగిసింది' అని ఎయిర్‌పోర్ట్‌ అధికారి చెప్పారు.

 

Related Posts