YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్దం

హైదరాబాద్
ఈ నెల 28 నుండి వచ్చే నెల 19 వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలుంటాయి. 15 వందల 21 ఎగ్జామ్ సెంటర్ లు వున్నాయని ఇంటర్ బోర్డ్ సెక్రెటరీ శృతి ఓజా అన్నారు.
27 వేల 900 మంది ఇన్విజిలేటర్ లు విధుల్లో వుంటారు. ఇంటర్ లో మొత్తం 9 లక్షల 80 వేల 978 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. 4లక్షల 78వేల 718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు, 5 లక్షల 02వేల 260 మంది ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కి హాజరు అవుతున్నారు. పోలీస్, రెవెన్యూ, ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులతో సమన్వయం తో ఎగ్జామ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసాము. 9 గంటల తరవాత పరీక్ష హల్ లోకి అనుమతి ఉండదు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో వుటుంది. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర హెల్త్ క్యాంప్ వుటుంది. ఎగ్జామ్ టైమింగ్ లను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసాం. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరా లు వుంటాయి. విద్యార్థులు మానసిక ఒత్తిడి కి గురైతే కౌన్సిలింగ్ ఇచ్చేందుకు టెలి మానస్ సేవలు అందుబాటులో వుంటాయి. టోల్ ఫ్రీ నంబర్ 14416....ఇప్పటి వరకు 475 కాల్స్ వచ్చాయి. విద్యార్థులు ఒత్తిడి కి లోనూ కావద్దని అన్నారు.

Related Posts