YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గురు దక్షిణపై రేవంత్ గురి

గురు దక్షిణపై రేవంత్ గురి

హైదరాబాద్, ఫిబ్రవరి 29,
తెలంగాణలో శాసనసభ ఎన్నికలు ముందు జరుగుతాయి. ఏపీలో పార్లమెంటు ఎన్నికలతో పాటు తర్వాత జరుగుతాయి. రెండు ఎన్నికల మధ్య నెలల గ్యాప్ ఉంటుంది. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందే.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ అవుతుందని అంటున్నారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండు సార్లు విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలలో 2014 ను పక్కన పెడితే 2018 ఎన్నికల్లో మాత్రం లోపాయికారీగా కేసీఆర్ వైసీపీ అధినేత జగన్ కు మద్దతిచ్చారన్న విమర్శలున్నాయి. నిధులతో పాటు చంద్రబాబుపై నెగిటివ్ కామెంట్స్ చేసి అప్పుడు జగన్ కు అనుకూలంగా ఎన్నికల ఫీల్డ్ ను మార్చారన్నది టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేశారు.  జగన్ ను గెలవాలని కేసీఆర్ బలంగా కోరుకున్నారని అంటారు. ఎందుకంటే తనకంటే సీనియర్ అయిన చంద్రబాబు పొరుగు రాష‌్ట్రంలో ఉంటే తనకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయని ఆయన జగన్ కు నాడు మద్దతిచ్చారంటారు. చంద్రబాబును మొత్తం చదివేసిన కేసీఆర్ ఆయనను ఎన్నికల వేళ టార్గెట్ చేసి జగన్ కు పరోక్షంగా సాయపడ్డారంటారు. కేవలం మాటలే కాదు.. పెద్దయెత్తున మూటలు కూడా కేసీఆర్ నాడు జగన్ పార్టీకి అందించారన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. అందుకే 2019లో జగన్ విజయం సాధించిన తర్వాత ఆయన ప్రమాణస్వీకారానికి కేసీఆర్ వెళ్లి పెద్దరికంతో ఆశీర్వదించి వచ్చారని కూడా అంటారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎలాంటి వ్యాఖ్యలకు చోటుండదు. ఏ కోమటిరెడ్డి వెంకటరెడ్డో.. ఉత్తమ్ కుమార్ రెడ్డో లేదా భట్టి విక్రమార్క ముఖ్యమంత్రిగా ఉంటే ఇలాంటి అపోహలకు తావుండదు. కానీ ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన చంద్రబాబుకు ఏకలవ్య శిష్యుడిగా ఉంటారు. తన రాజకీయ గురువు చంద్రబాబు అని చెప్పుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం వెనుకంజ వేయరు. ఏపీలో ఎన్నికలున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు రాలేదు కానీ, లేకుంటే రెక్కలు కట్టుకుని వాలి ఉండేవారంటారు. గురువు గారు గెలవాలని... అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏపీలో తన గురువుగారు గెలవాలని సహజంగానే కోరుకుంటారు. గురువొక రాష్ట్రంలో.. శిష్యుడు మరొక రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా ఉంటే ఆ సీనే వీరు. పొలిటికల్ గా ఆ కిక్కే సపరేట్. గురువును మించిన శిష్యుడిగా పాలనలో నిరూపించుకునే వీలు కూడా రేవంత్ కు దక్కుతుంది. అంతే కాకుండా తనకు శత్రువుగా భావించే జగన్ ఓడిస్తే తన రాష్ట్రంలో కొంచెం తనకు ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. చంద్రబాబుకు కేంద్రంలోనూ గ్రిప్ ఉంటుంది కాబట్టి తన పదవి కూడా పదిలంగా ఉంటుంది. ఇన్ని లెక్కలున్నాయ్ మరి. అందుకే రేవంత్ రెడ్డి సహజంగానే చంద్రబాబు గెలవాలని కోరుకుంటారు. అందులో తప్పేమీ లేదు. ఇప్పుడు పెద్దయెత్తున నిధులను తన గురువు గారి కోసం రేవంత్ ఇక్కడి పారిశ్రామికవేత్తల నుంచి సమీకరిస్తున్నారన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినపడుతున్నాయి. కనపడుతున్నాయి. అయితే అందులో నిజానిజాలు పక్కన పెడితే జగన్ ప్రచారానికి మాత్రం ఏపీలో ప్రచారానికి మంచి ఫుడ్డు దొరికిందనే చెప్పాలి.

Related Posts