YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హూస్నాబాద్ లో చిచ్చు రేగుతోంది....

హూస్నాబాద్ లో చిచ్చు రేగుతోంది....

కరీంనగర్, ఫిబ్రవరి 29,
లోక్ సభ ఎన్నికల సమీపిస్తుండడంతో హుస్నాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బండి సంజయ్ తన తల్లిని అవమానపరిచేలా మాట్లాడారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాజకీయాలతో తన తల్లికి ఏమైనా సంబంధముందా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీగా హుస్నాబాద్‌కు ఏం చేశావని ప్రశ్నిస్తే బతికున్న తన తల్లి ఆత్మక్షోభిస్తుందని దిగజారి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా గెలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తావా? అని నన్ను అడుగుతున్న బండి సంజయ్... మూడుసార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయారని గుర్తుచేశారు. తన దయాదాక్షిణ్యాల మీద అర్బన్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ అయ్యారన్నారు.తాను హిందువునని, మాంసం తిననని అంత నిష్టగా ఉంటానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాముని జన్మభూమిఎక్కడ అని తాను అనలేదన్నారు. అలా అంటే తాను సజీవ దహనానికి సిద్ధమన్నారు. హుస్నాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహం వద్ద తన తల్లి గురించి అవమానకరంగా మాట్లాడారని ఆరోపించారు. ఇప్పుడేమో మళ్లీ నా తల్లి కాళ్లు మొక్కుతా అంటున్నవా? అని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు తన భార్య మంగళ సూత్రాలు అమ్ముకున్నా... బండి సంజయ్... ఇలా మాట్లాడడం బాధాకరమన్నారు. రాజకీయాల్లో కుటుంబ సభ్యుల గురించి సరికాదన్నారు. బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్, బండి సంజయ్ కుమ్మక్కు అయ్యారని పొన్నం ప్రభాకర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పై కోడిగుడ్లతో దాడి జరిగింది. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గం వంగరలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లు విసిరారు. ఈ దాడిపై అసహనం చెందిన బండి సంజయ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పోలీసు బందోబస్తు వద్దని, తన కార్యకర్తలు సాయంతో యాత్ర చేస్తానన్నారు. వంగరలోని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇంటిని ఎంపీ బండి సంజయ్ సందర్శించారు. అక్కడి నుంచి బండి సంజయ్ ముల్కనూర్‌ వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరారు. బండి కాన్వాయ్‌లోని మీడియా వాహనంపై కోడిగుడ్లు పడ్డాయి.ఈ దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్... మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాలతో కాంగ్రెస్‌ కార్యకర్తలే ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసుల సమక్షంలో దాడి జరిగినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. తనకు పోలీసుల భద్రత అవసరం లేదని, తన రక్షణ బీజేపీ కార్యకర్తలే చూసుకుంటారని బండి సంజయ్ అన్నారు.

Related Posts