కిర్లంపూడి
పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమనేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాసారు. 2019 ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్లి వచ్చిన తర్వాత కిర్లంపూడి వస్తానని మరొకసారి కబురు పంపారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పాను. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతు కృషి చేయాలని ఎటువంటి ఫలితం ఆశించకుండా సేవా మీతో చేయించాలని అనుకున్నాను. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి బలంగా కోరుకున్నారు. వారందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డాను. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించాను. మీరు కూడా అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను, కానీ దురదృష్టవశాత్తు నాకు ఆ అవకాశం మీరు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు టిడిపి క్యాడర్ మొత్తం బయటికి రావడానికి భయపడి ఇంటికే పరిమితమయ్యారు. అటువంటి కష్ట కాలంలో మీరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడం అన్నది సామాన్య విషయం కాదు. చంద్రబాబు పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలను. ఏపీ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారు. మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం ప్రజలలో పరపతి లేని వాడిని మీరు భావించడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా ఉన్నాను. నేను తుప్పు పెట్టిన ఇనుము లాంటి వాడినిగా గుర్తింపబడడం, మీరు మా ఇంటికి వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు కదా మీరు ఎన్నో చోట్ల పర్మిషన్ తీసుకోవాలి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు రాకూడదని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి. ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ అని ముద్రగడ ముగించారు.