YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అందోళన బాటలో మిర్చిరైతులు

అందోళన బాటలో మిర్చిరైతులు

ఖమ్మం
ఖమ్మంలో మిర్చి రైతులు మరోసారి భగ్గుమన్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాకపోవటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రేటుకే మిర్చి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చేపట్టారు.ఖమ్మం మార్కెటుకు వచ్చిన మిర్చిని క్వింటాకు రూ.20,800 చొప్పున జెండా పాట తో వ్యాపారస్తులు కొనుగోలు చేశారు.
అయితే ఆ తరువాత మిగిలిన మిర్చినీ వ్యాపారులు సిండికేట్ అయి క్వింటాకు రూ.16,000 నుంచి రూ.18000మాత్రమే చెల్లిస్తామని చెప్పటంతో అన్యాయమని రైతులు నిలదీశారు. ధర విషయమై వారు వ్యాపారులతో వాగ్వివాదానికి దిగారు. మార్కెట్ ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి చర్చలు జరిపి కొనుగోలు చేస్తారని హామీ ఇచ్చారు.కానీ వివాదం సమసిపోలేదు.తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఫోన్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి రైతులు తీసుకెళ్లారు. మంత్రి హామీతో కొంత శాంతించారు.

Related Posts