గుంటూరు, మార్చి 6
మార్చి నెల ముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటే.. ప్రజలు వణికిపోతున్నారు. ఉదయం 9 కాకుండానే భానుడు భగభగమంటున్నాడు. మార్చి మొదటి వారం కూడా కాకముందే ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వస్తుంది. పోయినా ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు మరింత ముందుగా వచ్చేశాయి. భానుడి దాటికి ప్రజలు ఇళ్ల నుంచి కదలడంం లేదు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా దేశ వ్యాప్తంగా భానుడి వేడి ఇలానే ఉందని వాతావరణశాఖాధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చి మూడో వారం నుంచి క్రమక్రమంగా ఎండలు పెరిగి మే నెల నాటికి వాటి తీవ్ర ప్రతాపాన్ని చూపుతాయి.కానీ ఈ ఏడాది మాత్రం మార్చి 2 వ వారం కూడా రాకముందే ఎండలు మండుతుండడంతో పాత రికార్డులను భానుడు తిరగరాస్తాడని వాతావరణశాఖాధికారులు తెలిపారు. మార్చి మొదటి వారంలోనే 36 డిగ్రీల వరకు ఉంటే రెండవ వారంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 40 డిగ్రీల వరకు చేరే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ నవంబర్- జనవరి మధ్యలోనే పసిఫిక్ లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదు అయినట్లు ప్రకటించారు. దాని వలనే ఎల్‌నినో ఏర్పడింది. దాని వల్లే అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని అధికారులు ఆరు నెలల ముందే చెప్పారు. ఇదిలా ఉంటే లానినో ప్రభావం వల్ల జూన్ మొదటి వారం నుంచి వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖాధికారులు వివరించారు.మార్చిలోనే మాడు పగిలిపోయే ఎండలు ఉంటాయని చెప్పిన వాతావరణశాఖే… లానినో వచ్చి వర్షాలు కూడా పడతాయని అంచనా వేసి చెబుతుంది. ఇప్పుడు ప్రారంభమైన ఎండలు మే ఆఖరు వరకు తీవ్రంగానే ఉండే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.