YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రేవంత్ అత్యుత్సాహమేనా.... మైండ్ గేమా...

రేవంత్ అత్యుత్సాహమేనా.... మైండ్ గేమా...

హైదరాబాద్, మార్చి 6,
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ నాయకుడు కంటే ముందు  అచ్చమైన రాజకీయ నాయకుడు అని నిరూపించుకున్నారు.  మోదీ పాలనను విమర్శిస్తూ..  బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందిన ఆయన ఇప్పుడు ప్రధాని మోదీ విషయంలో మాత్రం పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. చేవెళ్ల సభలో గుజరాత్ మోడల్ అంటే రైతుల్ని చంపడమేనని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి మోదీ వేదికపై ఉన్న స్టేజ్ మీద మాత్రం.. గుజరాత్ లాగా తెలంగాణను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీని బడే భాయ్‌గా అభివర్ణించారు. ‘ప్రధాని మోదీ మాకు పెద్దన్న లాంటి వారు’ ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. తమకు బీజేపీ మోదీతో మాత్రమే విభేదాలు ఉన్నాయని, ప్రధాని మోదీతో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీని వ్యతిరేకిస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాదని, కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర మంత్రి వర్గం, ప్రధానమంత్రి ఉంటారు. వారితో రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉండాలనే తాము ఆకాంక్షిస్తామని హితవు పలికారు. ఆ తర్వాత నొప్పించకుండా సుతిమెత్తగా తన విన్నపాలను మోడీ ముందు ఉంచారు. ఈ సభలో మాట్లాడుతూనే ప్రధాని అంటే మాకు పెద్దన్న లెక్క, ఆయనతో గొడవ పడతామా అని ప్రధాని మోడీ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిని పరోక్షంగా ఎండగట్టారు. ఇది రేవంత్ రాజకీయ వ్యూహమే అనుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రాల పర్యటనకు వచ్చింది ఎన్నికల ప్రచారం కోసమని అందరికీ తెలుసు. కానీ ఆయన అందుకు వేసిన ముసుగు మాత్రం అభివద్ధి పనులు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మోదీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  మోదీని పెద్దగా చెప్పుకున్నారు. ఆయనతో రాసుకుని పూసుకుని తిరిగారు.  నవ్వుకున్నారు.  రేవంత్ తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేశంలో ప్రభుత్వాలు నిలబడాలంటే కంద్రం .. ముఖ్యంగా మోదీ, షా అనుగ్రహం ఉండాల్సిందే. తేడా వస్తే ఏం జరుగుతుందో మహారాష్ట్రలో చూశాం. హిమాచల్ ప్రదేశ్ లో చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరవాత రేవంత్ ప్రభుత్వం ఉంటుందో ఉండదో తెలియదంటూ  బీజేపీ నాయకులు వ్యూహాత్మకంగానే విమర్శలు చేస్తున్నారు.  ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి నేరుగా ప్రధాని మోదీకే  మాటలతో కాకుండా చేతలతో సందేశం ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వచ్చినా  బీజేపీకి  ఇప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది.. మనమంటే గౌరవమే కదా అని అనిపించుకునేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారని రాజకీయవర్గాలు అచనా వేస్తున్నాయి.  ప్రధాని మోదీ కూడా.. రేవంత్ విషయంలో  అంత వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఆయన కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ.. తనకు చక్కగా ప్రోటోకాల్ ఇచ్చి..  ఏ మాత్రం వివాదాస్పదం కాకుండా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై మోదీకి అభిమానం పెరగకుండా ఉంటుందా అన్న సందేహం ఎవరికైనా వ్సతుంది.   రేవంత్ రెడ్డి ..మోదీ విషయంలో కాస్త అతిగా వ్యవహరించి.. ఆయనతో శత్రుత్వం లేకుండా చూసుకోవచ్చు కానీ.. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్ హైకమాండ్ లో రేవంత్ పై ఏర్పడే అనుమానాలను ఎలా నివృతి చేస్తారన్నది కీలకం.  రేవంత్ రెడ్డి   స్వతహాగా కాంగ్రెస్ లీడర్ కాదు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కాంగ్రెస్ లోకి ఆహ్వానించినా వెళ్లలేదు. ముందుగా రేవంత్ కెరీర్.. ఏబీవీపీ నుంచి ప్రారంభమైందని అందరూ చెబుతారు. అది నిజం కూడా. ఆయన లక్ష్యం కేసీఆర్ ను ఓడించి ముఖ్యమంత్రిని కావడం. రాజకీయ ఏకీకరణ పేరుతో కాంగ్రెస్ లో చేరారు. ఆ లక్ష్యాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన లక్ష్యం ప్రభుత్వాన్ని కాపాడుకోవడం.    సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఓ సారి ప్రధాని మోదీని ఢిల్లీలో కలిశారు. అప్పట్లో  రేవంత్ రెడ్డి వెంట  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.  రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ... చేశారని చెప్పలేం కానీ.. మోదీతో ఆయన రాపో పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు మాత్రం..ఆయనపై కాంగ్రెస్ హైకమాండ్‌లో ఓ సందేహం లెవనెత్తే అవకాశాలు ఉన్నాయి. దీన్ని పెంచేందుకు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ లోని ఆయన ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు. అదే రాజకీయం.రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు.    దానికి రేవంత్ కు బాగా సాయం చేసింది..  బీజేపీ అనే అనుకోవాలి. బీజేపీ వ్యూహం ఏమిటో తెలియదు కానీ..  కీలకమైన సమయంలో బండి సంజయ్ ను పదవి నుంచి తప్పించారు.  కల్వకుంట్ల కవితను అరెస్టు చేయలేదు.  దీంతో .. బీజేపీ  వెనుకబడిపోయింది. చివరికి కాంగ్రెస్ గెలిచింది. అందుకే బండి సంజయ్..తరచూ తమ నోటి కాడ కూడు రేవంత్ రెడ్డి లాగేసుకున్నారని అంటున్నారు. ఆయన లాక్కున్నారన్నదాని కన్నా..   వారే ఇచ్చారనడం కరెక్ట్. ఆ అభిమానం రేవంత్ రెడ్డి చూపిస్తున్నారేమో కానీ.. రేవంత్ రాజకీయం మాత్రం... భిన్నంగా ఉంది. కానీ ఆయన రాజకీయాల్ని తనదైన శైలిలో డీల్ చేయగలరని.. ఆయన రాజకీయ ప్రస్థానం  చూస్తే అర్థమైపోతుంది.

Related Posts