YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

800కి.మీల మైలురాయి దాటిన జగన్ పాదయాత్ర

800కి.మీల మైలురాయి దాటిన జగన్ పాదయాత్ర

 ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 800 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని నల్లవెంగణపల్లి వద్ద ఎనిమిది వందల కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. ఈ సందర్భంగా గ్రామంలో వైఎస్ జ‌గ‌న్ మొక్క‌ను నాటారు.

మొక్క‌వోని సంక‌ల్పం
ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాల‌ని గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇడుపుల‌పాయ నుంచి ప్ర‌జాసంక‌ల్పయాత్ర‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్రలో ప్ర‌తి వంద కిలోమీట‌ర్ల‌కు ఒక మొక్క‌ను నాటుతూ ఆయన ముందుకు సాగుతున్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మైన ప్రజాసంకల్పయాత్ర నవంబర్ 14న కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది.

క‌ర్నూలు జిల్లా ఆళ్లగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో 100 కిలోమీటర్లు మైలురాయి, డోన్ నియోజ‌క‌వ‌ర్గంలో 200 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటిన వైఎస్‌జగన్‌.. 21వ రోజు పాదయాత్రలో 300 కిలోమీట‌ర్ల మైలు రాయిని కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గం బి.అగ్రహారం వద్ద పూర్తి చేసుకున్నారు. 29 రోజు పాదయాత్రలో భాగంగా అనంత‌పురం జిల్లా గుమ్మేపల్లిలో 400 కి.మీ మైలురాయిని చేరుకున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం ఉట్లూరు గ్రామంలో 500 కిలోమీటర్లు, డిసెంబ‌ర్ 24న అనంత‌పురం జిల్లా ఉట్లూరు వ‌ద్ద 600 కిలోమీట‌ర్లు, చిత్తూరు జిల్లా జ‌మ్మివారిప‌ల్లె వద్ద 700 కిలోమీట‌ర్ల మైలురాయిని వైఎస్‌ జగన్‌ చేరుకున్న విషయం తెలిసిందే.

Related Posts