YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తుదిదశకు కాంగ్రెస్ జాబితా

తుదిదశకు కాంగ్రెస్ జాబితా

హైదరాబాద్, మార్చి6
తెలంగాణలో 17కి 17 సీట్లు గెలుస్తామని ఢంకా బజాయిస్తున్న కాంగ్రెస్‌, గెలుపు గుర్రాలను రంగంలోకి దించే కసరత్తును చివరిదశను తీసుకొచ్చింది. చాలా సెగ్మెంట్లలో ఇప్పటికే అభ్యర్థులు షార్ట్‌లిస్ట్‌ అయ్యారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎలక్షన్‌ కమిటీ భేటీ అవుతోంది. తొలిజాబితాలో తెలంగాణ సీట్లను కాంగ్రెస్‌ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణపై కాంగ్రెస్‌ ఫోకస్‌ చేస్తోంది.మహబూబ్‌నగర్‌ సీటుకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డి పేరును ఇప్పటికే CM రేవంత్‌ ప్రకటించారు. మిగతా సీట్లపై మాత్రం హైకమాండ్‌ ప్రకటన చేస్తుందని చెబుతున్నారు. ఒకవైపు తెలంగాణ నుంచి బరిలోకి దిగాల్సిందిగా రాహుల్‌గాంధీని కాంగ్రెస్‌ నేతలు కోరారు. కేరళలోని వాయనాడ్‌లో CPI ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దించడంతో, తెలంగాణ నుంచి ఆయన్ను బరిలోకి దించడానికి కాంగ్రెస్‌ నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో 17 సీట్ల టార్గెట్‌ను చేరుకోవాలంటే పార్టీకి మరింత జోష్‌ కావాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసమే రాహుల్‌గాంధీని పోటీకి దించేలా లాబీయింగ్‌ చేస్తున్నారు.ఇప్పటికే ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే పార్లమెంట్ పరిధిలో పాలమూరు న్యాయ యాత్ర పేరుతో వంశీచంద్ రెడ్డి పర్యటన పూర్తి చేసుకున్నారు. ఈ యాత్ర ముగింపు సభకు ప్రజా దీవెన సభగా నామకరణం చేశారు.పాలమూరు ప్రజా దీవెన సభా వేదికగా జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పలు వరాలు ప్రకటిస్తారని సమాచారం. విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తూ పలు విద్యాసంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది. మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఉపఎన్నిక అభ్యర్థిని కూడా ప్రకటిస్తారని చెబుతున్నారు.

Related Posts