బద్వేలు
తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా వెనుకబడిన(బిసి)వర్గాలకు న్యాయం జరిగేలా తెలుగుదేశంపార్టీ,జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ మంగళగిరి వేదికగా జరిగిన బిసి డిక్లరేషన్ మహాసభలో బిసిలను అన్ని విధాల ఆదుకుంటామని ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ విషయమని టిడిపి బీసీసెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలవలి వేణుగోపాల్ అన్నారు. బుధవారం ఉదయం బద్వేలు పట్టణ తెదేపా కార్యాలయంలో ఏర్పాటుచేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిలకు 50 సంవత్సరాలకే 4 వేల రూపాయలు పింఛన్ అందజేస్తామని,స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ పునర్దస్తామని, చట్టసభల్లో 33% రిజర్వేషన్ అమలు చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రనికి పంపి ఒత్తిడి తెస్తామని అన్నారు.. ,అదేవిధంగా రాజకీయంగా అధిక అవకాశాలు కల్పిస్తామని అదే విధంగా జనాభా ప్రతిపాదికన తక్కువగా ఉండి ఎన్నికల్లో నేరుగా పోటీ చేయలేని కులాలకు స్థానిక సంస్థల్లో కోఆప్షనునెంబర్లుగా,అన్ని నామినేట్ పదవుల్లో 34 శాతం అమలు చేస్తామని, సమాజంలో బీసీలపై జరుగుతున్న సామాజిక దాడులకు,ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని అదేవిధంగా వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడు అందిస్తామని ప్రత్యేకంగా బీసీలకు సబ్ ప్లాను గాను లక్షా 50 వేల కోట్లు ప్రత్యేక బడ్జెట్లో కేటా ఇస్తామని నిధులు బీసీలకు ఖర్చయ్యేలాగా అమలు చేస్తామని బీసీలకు చట్టబద్ధంగా కులగణన చేయిస్తామని బీసీ కుటుంబాలకు చంద్రన్న బీమా ద్వారా పది లక్షల రూపాయలు అందజేస్తామని బీసీ ఆడపడుచులకు పెళ్లి కానుక కింద లక్ష రూపాయలు నగదు అందజేస్తామని రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వాము ఏర్పడడానికి బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ ఐకమత్యంతో తెలుగుదేశం, జనసేన పార్టీలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సమావేశంలో టిడిపి సీనియర్ బిసి నాయకులు గోవిందపల్లె కృష్ణయ్య,గంటా వెంకటయ్య యాదవ్,బద్వేలు వెంకటసుబ్బయ్య(బాబు), వడ్డమాను గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు