YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు నేస్తం ప్రారంభించిన సీఎం రేవంత్, మంత్రులు

రైతు నేస్తం ప్రారంభించిన సీఎం రేవంత్, మంత్రులు

హైదరాబాద్
రైతు నేస్తం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ప్రారంభించారు. రైతు వేదిక లకు  వీడియో కాన్ఫరెన్స్ అను సంధానం ద్వారా రైతుల సమస్యల ను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. దశలవారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన. రూ.97 కోట్ల తో ప్రాజెక్టు అమలు చేస్తారు. ప్రారంభ  దశలో 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు. రూ. 4.07 కోట్లు  ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ఫ్లాట్ ఫారం వుంటుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలపై రైతులతో చర్చలు జరుపుతారు. గ్రామాల నుంచే రైతులు ఆన్ లైన్లో తమ పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందుకోవటం. తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవటంచేయవచ్చు. ప్రతి మంగళవారం, శుక్రవారం విస్తరణాధికారులు, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుంది.  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో రాష్ట్ర వ్యవసాయశాఖ రైతులకు భరోసానిచ్చేందుకు ఈ   కార్యక్రమం చేపట్టింది.

Related Posts