YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బీసీలకు ఎవరు ఏం చేశారు

బీసీలకు ఎవరు ఏం చేశారు

విజయవాడ, మార్చి 7
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల మరో పది రోజుల్లో రాబోతోంది. ఈమేరకు ఎన్నికల సంఘం ఇస్పటికే ఏర్పాట్లు చేసింది. అధికార వైసీసీ, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపు పూర్తి చేశాయి. టీడీపీ జనసేన కూటమిగా ఎన్నికలకు వెళ్తుండగా, వైసీసీ ఎంటరిగానే పోటీ చేస్తామంటోంది. ఈ క్రమంలో వైసీపీ మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది. మరోవైపు టీడీపీ–జనసేన కూటమి కూడా ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో మార్చి 5న ఉమ్మడి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాయి. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామో ఇందులో పేర్కొన్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా బీసీలకు వైసీపీ ఏం చేయలేదని విమర్శించాయి. విభజిత ఏపీకి టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉంది. ప్రస్తుతం వైసీపీ ఐదేళ్లు పాలించింది. మరి ఎవరు ఏం చేశారన్న చర్చ ఇప్పుడు ఏపీలో జరుగుతోంది.చంద్రబాబుది ఉంటే ఓడమల్లయ్య.. లేకుంటే బోడ మల్లయ్య సిద్ధాంతం. ఎన్నికలు రాగానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు గుర్తొస్తారు. పదవులు, పోస్టింగులు అంటూ హామీలు ఇస్తాడు. కానీ గెలిచాక తమ కులాలవాళ్లకు, తమకు అండగా నిలిచిన వాళ్లకే ఇచ్చుకుంటాడు. ఇందుకు తాజా ఉదాహరణ టీడీపీ ప్రకటించిన టిక్కెట్లే.
టీడీపీ ఏం చేసింది..
– బీజీలు జడ్జీలుగా పనికిరారని కేంద్రానికి లేఖ రాసింది చంద్రబాబు నాయుడు.
– నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తా, మత్స్యకారుల తోలు తీస్తా అని కసురుకున్నది ఆ బాబే.
– ఏపీ సీఎం జగన్‌ స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 34 శాతం పదవులు కేటాయిస్తూ 2019 డిసెంబర్‌లో జీవో తెచ్చారు. చట్టబద్ధమైన వాటా ఇచ్చారు. అయితే బాబు దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీం కోరుట్లో టీడీపీ నేత బిర్రుప్రతాపరెడ్డితో కేసు వేయించారు.
– వాస్తవానికి 2019, మార్చిలో చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అమలు తీరును పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా ప్రతాపరెడ్డిని నియమించింది. ఈ కేసు దెబ్బతో జగన్‌ సర్కార్‌ ఇచ్చిన జీవో సుప్రీంకోర్టు నిలిపివేసింది. రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేసింది.
జగన్‌ ఏం చేశారు..
మరి జగన్‌ సీఎంగా ఐదేళ్లలో బీసీలకు ఏం చేశాడో చూదాం.
– బీసీలు అంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బీసీలంటే దేశానికి బ్యాక్‌ బోన్‌ అని ప్రకటించారు.
– డీబీటీ (నగదు బదిలీ) ద్వారా రూ.1.15 లక్షల కోట్లు బీసీలకు బ్యాంకు ఖాతాల్లో వేశారు.
– నగదేతర బదిలీ ద్వారా రూ.50,321,88 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారు.
బీసీలకు కీలక పదవులు..
ఇక జగన ప్రభుత్వం బీసీలకు కీలక పదువులు కూడా ఇచ్చింది. క్యాబినెట్‌లో 11 మంది బీసీలు ఉండగా, చంద్రబాబు కేవలం 8 మందికి పదవులు ఇచ్చారు.
– జగన్‌ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు. చంద్రబాబు 5 గురిని పంపించారు. ప్రస్తుతం ఒక్కరూ లేరు.
– జగన్‌ ప్రభుత్వంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం(బీసీ) చంద్రబాబు ప్రభుత్వంలో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌(చౌదరి)
ఎమ్మెల్యే టికెట్లు పరిశీలిస్తే..
వైసీసీ బీసీలకు 30 ఎమ్మెల్యే టికెట్లు, 19 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. కార్పొరేషన్లు –56, మేయర్‌ పదవులు –9, మున్సిపల్‌ చైర్మన్లు 98, జెడ్పీ చైర్మన్లు 9, జెడ్పీటీసీలు 215 ఇచ్చింది. ఇవి కాకుండా టీడీపీ నుంచి గత ఎన్డీఏ హయాంలో వచ్చిన ఇద్దరు కేంద్ర మంత్రులు అశోక్‌ గజపతిరాజు, సుజనాచౌదరి బీసీలు కాదు.

Related Posts