ఎమ్మిగనూరు
కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడికల్ గ్రామ ప్రజలు దుస్సాహసానికి పూనుకున్నారు. చిరుతపులి భయంతో ఏకంగా కొండకే నిప్పుపెట్టారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోంది. మేకలు, పశువుల మందపై దాడి చేస్తున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు బోన్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మూడువారాల క్రితం ఓ చిరుతను బంధించారు. అయితే ఇంకో చిరుత తిరుగుతోందనే భయంతో బుధవారం రాత్రి గుడికల్ గ్రామవాసులు కొండకు నిప్పుపెట్టారు.