కాళహస్తి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు వేడుకలు శ్రీకాళహస్తి క్షేత్రంలో గంధర్వరాత్రి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ అలంకార మండపంలో అర్చక, వేద పండితులు.. జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించి.. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ మహామంగళహారతి ఇచ్చి స్వామి, అమ్మ వార్లను చతుర్ముఖ మాడవీధుల్లో రావణ, మయూర , వాహనాల సేవ నిర్వహించారు. భక్తాగ్రేసరుడైన రావణ వాహనంపై, శ్రీకాళహస్తీశ్వర స్వామి, మయూర వాహనంపై జ్ఞానప్రసూనాంబ పుర విహారం చేశారు. విద్యుత్ దీపాల కాంతిలో జరిగిన ఊరేగింపులో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్ల దివ్య మంగళ రూపాన్ని దర్శించకున్నారు