నంద్యాల
అనాదిగా అన్ని రంగాల్లో వివక్షతకు గురవుతూ పేదరికంలో మగ్గుతున్న మైనార్టీ వర్గాల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని రాష్ట్ర ముస్లిం మైనార్టీ నాయకులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. హరూన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీ వర్గాల హక్కుల సాధన కోసం నంద్యాలలో ఈ నెల 10 న ముస్లిం మైనార్టీల హక్కుల మహా గర్జనకు వేలాది గా రావాలని పిలుపునిచ్చారు.దేశ వ్యాప్తంగా ముస్లిం మైనార్టీలకు చెందిన వక్స్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ ఇక్యమత్యంగా పోరాడుదామని అన్నారు.రాష్ట్రంలో వాక్స్ చెందిన సుమారు66 వేళ భూములు వున్నా సగం భూ కబ్జా దారుల కబందహస్తల్లో నలిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.కర్నూల్ జిల్లాలో సుమారు 30 వేల భూములు ,విలువైన స్థలాలు ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోందని అన్నారు.స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా రాజకీయ పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంక్ గా గుర్తించి పాబ్బం గడుపుతున్నారని అన్నారు.మైనార్టీలకు కంటి తుడుపు చర్యగా అధికారాలు లేని శాఖలు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారు అని ఆరోపించారు.ముస్లిం మైనార్టీలు ఇప్పటికైనా మేల్కొని మన హక్కులు సాధించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని అన్నారు.మా ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.ఆంధ్ర ప్రదేశ లో 66 వేల ఎకరాలకు పైగా ఉన్న వాక్స్ భూములు రక్షించాలి, అన్యాక్రాంతం అయిన భూముల పరిరక్షణ చేసి పేద ముస్లిం మైనార్టీలకు పంపిణీ చేయాలన్నారు. వక్స్ బోర్డ్ కు చెందిన స్థలాల్లో షాపింగ్ మాల్స్,కాంప్లెక్స్ లు నిర్మించి ముస్లిం మైనార్టీలకు లీజుకు ఇవ్వాలన్నారు.ప్రత్యేక ముస్లిం మైనార్టీ కార్పొరేషన్లను పునరుద్ధరించాలని ,పేద ముస్లిం లకు రుణ సదుపాయం కల్పించాలని అన్నారు.దేశ,విదేశీ చదువుల కోసం ఆర్థిక సహాయంతో పాటు స్కాలర్ షిప్స్ ఇవ్వాలన్నారు. షాదీ ముబారక్,పండుగ తొఫా పథకాలు అందించాలన్నారు.ఉర్దూ యూనివర్సిటీలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలన్నారు.ప్రతి జిల్లాలో వ వ క్స్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.కర్నూల్ లో శిధిలావస్థలో వున్న యునాని కాలేజీ అభివృద్ధికి నిధులు కేటాయించి భవనాలు నిర్మించాలని అన్నారు.అన్యాక్రాంతమైన వక్స్ భూములు గుర్తించడానికి గ్రూప్ వన్ స్థాయి అధికారిని నియమించి జుడిషియల్ అధికారాలు కల్పించాలని కోరారు.రాజకీయ పార్టీలు ఎంపి,ఎమ్మెల్యే సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు.అధికార పార్టీలు ముస్లిం మైనార్టీ వర్గాలకు చెందిన నేతలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్గిన మంత్రిత్వ శాఖలు కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.