YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పోటీకి దూరమంటున్న గుత్తా కొడుకు

పోటీకి దూరమంటున్న గుత్తా కొడుకు

నల్గోండ, మార్చి 7,
దీపం ఉండగానే ఇంటినిచక్కబెట్టుకోవాలని భావించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. తనయుడు గుత్తా అమిత్ రెడ్డిని పొలిటికల్ ఎంట్రీ చేయించాలని భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ, మునుగోడుల నుండి తనయుడి పొలిటికల్ ఎంట్రీకి గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకొండ బీఆర్ఎస్ ఇన్‌చార్జీగా అమిత్ వ్యవహరించాడు. పార్లమెంట్ ఎన్నికల్లో తనయుడు పొలిటికల్ ఎంట్రీకి గుత్తా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు గుత్తా సుఖేందర్‌రెడ్డి.. అటు అమిత్‌ కూడా.. నల్లగొండ ఎంపీగా పోటీ చేయడానికి తాను సిద్ధమంటూ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బహిరంగంగానే ప్రకటించారు.అసెంబ్లీ ఎన్నికలో ఓటమి చవిచూసిన బీఆర్ఎస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని వ్యూహాలకు పదును పెడుతోంది. గులాబీ దళపతి పార్లమెంటు నియోజక వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను కేవలం సూర్యాపేటలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో ఈసారి నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయడం బీఆర్ఎస్ కు సవాల్ గా మారింది.సుఖేందర్ రెడ్డితో ఉన్న పాత వైరానికి కొందరు నేతలు కొత్త పదును పెట్టారట. ఇందులో భాగంగానే నల్లగొండ నుండి పోటీకి కొందరు మాజీల పేర్లను తెరపైకి తీసుకు వచ్చిందట. ఇదంతా అమిత్‌కు టికెట్ రాకుండా చెక్ పెట్టేందుకేనని పార్టీలో టాక్. నల్లగొండ, భువనగిరిలో ఎక్కడ టికెట్‌ ఇచ్చినా పోటీకి సిద్ధమేనని గుత్తా చెప్పారు. తమకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యేలంతా జట్టు కట్టినందున ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడం కంటే.. కామ్‌గా ఉండటమే గౌరవప్రదమని గుత్తా భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో తాజాగా పార్లమెంటుకు పోటీపై గుత్తా పునరాలోచనలో పడ్డారట. కుమారుడి పొలిటికల్‌ ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న సుఖేందర్ రెడ్డి ఆశలపై.. సొంత పార్టీ నేతలే నీళ్లు చల్లడాన్ని గుత్తా జీర్ణించుకోలేక పోతున్నారట.ప్రస్తుతం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు తాను పోటీకి సిద్ధమైతే సహకరించాల్సింది పోయి.. వ్యతిరేకించడం ఏంటని గుత్తా ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తమను ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేకిస్తున్న వారితో మాట్లాడి సమన్వయం చేయాల్సిన పార్టీ పెద్దలు కూడా మిన్నుకుండడం పట్ల గుత్తా ఫ్యామీలీ అసంతృప్తితో ఉందట. తమను వ్యతిరేకిస్తున్న నేతల్లో సీనియర్ గా ఉన్న ప్రజా ప్రతినిధిని.. ఎంపీగా పోటీకీ దిగుతారా అని సవాల్‌ చేస్తున్నారట.అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నికలకు కూడా దూకుడు పెంచుతోంది. అయితే బీఆర్ఎస్ లో మాత్రం టికెట్ల గోలతో నేతల మధ్య కోల్డ్ వార్ పిక్ స్టేజికి వెళ్తోందట. దీంతో పార్టీ క్యాడర్ ఆందోళన చెందుతుందట.

Related Posts