శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం వైసిపి లో వర్గ పోరు మరోసారి బయట పడింది.. సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ని అభ్యర్థి గా ప్రకటిస్తే ఓడిస్తాం అంటూ ద్వితీయ శ్రేణి నాయకులు స్పష్టం చేస్తున్నారు. పాతపట్నం నియోజక వర్గం లో వైసీపీ హ్యాట్రిక్ విజయం సాధించాలంటే స్థానిక అభ్యర్థి లోతుగెడ్డ తులసి వర ప్రసాద రావు ను బరిలో దింపాలని పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు,కార్యకర్తలు అధిష్టానం కి సూచించారు..వైసీపీ అభ్యర్థి ప్రకటన బట్టి తమ నిర్ణయం ఉంటుందని డెడ్ లైన్ పెట్టారు.. నియోజక వర్గం లోని కొత్తూరు లో జగన్ ముద్దు, రెడ్డి శాంతి వద్దు అంటూ ప్రత్యేకం గా సమావేశం నిర్వహించారు... ఈ సమావేశానికి నియోజక వర్గంలో 163 గ్రామ పంచాయితీ ల్లో 322 బూత్ ల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు.. రెడ్డి శాంతి ని మార్చండి.. సరైన అభ్యర్థి ని ప్రకటించండి అంటూ వైఎస్ఆర్ సిపి జిల్లా కోశాధికారి లోతు గెడ్డ తులసి వర ప్రసాద రావు హితవు పలికారు.ఆమె పేరు చెబితే వ్యతిరేకత, పర్యటిస్తే నియోజక వర్గంలో గ్రామాలు తరిమి కొడుతున్నారనీ తెలిపారు..
నేతలు, కార్యకర్తలు, ప్రజలు అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తా ఈ సందర్భం గా అని వైఎస్ఆర్ సిపి జిల్లా కోశాధికారి లోతు గెడ్డ తులసి వర ప్రసాద రావు స్పష్టం చేశారు..సొంత పార్టీ నేతలను,కార్యకర్తలను హింసించి పార్టీ కి మాయని మచ్చ లా మారిన శాసన సభ్యురాలు రెడ్డి శాంతి కి టికెట్ కేటాయించే దుస్సాహసం చేస్తారని ఎవరు అనుకోరని అభిప్రాయ పడ్డారు..ఆమెకే సీటు ఇస్తే తాము ఆమెను ఓడించేందుకు సిద్దం అని పలువురు నేతలు తెలిపారు.. నియోజక వర్గ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.. అధికారం లో ఉన్నప్పుడు తన సొంత కుమారుడిని జెడ్పీటిసి గా గెలిపించుకొలేని ఎమ్మెల్యే పై సర్వే లన్ని ప్రతికూలంగా ఉంటే ఆమెకు మళ్ళీ దేనికి సిద్దం చేస్తారని ప్రశ్నించారు.. ఐదు మండలాల నుంచి వందలాది మంది ముఖ్య నేతలు,వేలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది ప్రజానీకానికి ఆమె ఏమి న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.తులసి వర ప్రసాద రావు కి బరిలోకి దింపితే టిడిపి కి దీటుగా ఎదురెల్లి భారీ మెజారిటీ తో గెలిపించు కుంటామని స్పష్టం చేశారు.