YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పచ్చి అబద్దాలు ఆడుతున్న సీఎం రేవంత్ ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్

పచ్చి అబద్దాలు ఆడుతున్న సీఎం రేవంత్  ఎమ్మెల్సీ కవిత చిట్ చాట్

హైదరాబాద్
రాష్ట్రంలో కృత్రిమమైన కరువు వుంది. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఈ కరువు. కేసిఆర్ ను బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారు. సాగునీరు,తాగునీరు ఇవ్వలేం అని ముఖ్యమంత్రి అంటున్నారు. నెత్తిమీద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలన లో బి సి మేజర్ కులాల ప్రాధాన్యత లేదు. మున్నూరు కాపు,ముదిరాజ్,యాదవ సామాజిక వర్గాల నుండి క్యాబినెట్ లో మంత్రి లేడు. రేవంత్ రెడ్డి బీజేపీ తో కలుస్తారు. బీజేపీ సపోర్ట్ తో 10 యేళ్లు ఉంటా అని అంటున్నాడు. అందుకే రేవంత్ రెడ్డి అంతు చూస్తా అన్నారు. రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే ఆయనపై కేసులు పెట్టాలి. అంతుచూస్తా,మానవ బాంబులు ఐతరు అని మాట్లాడ్డం దుర్మార్గం. కేసిఆర్ నియంత అని మాట్లాడారు..ఆ మేధావులు ఇప్పుడు నిర్బందాలపై మాట్లాడట్లేదు. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా నిలవబోతుంది రేవంత్ సర్కార్. బి.సి కులగణన తీర్మానం చేశారు..చట్ట బద్దత లేదని అన్నారు.
ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ధర్నా చౌక్ లో పర్మిషన్ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా రేపు జాగృతి అధ్వర్యంలో దీక్ష చేసి తీరుతాం. ఎంపి గా పోటీ చేయాలని పార్టీ నిర్ణయంపై కట్టుబడి ఉంటా. అరవింద్ ఎక్కడ నిలబడ్డా ఒడిస్తా..మొన్న కోరుట్లలో ఒడించా..ఎంపి ఎన్నికల్లో అదే..అది ఎప్పుడూ పర్మినెంట్ అజెండా. ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన ఇది.యు ట్యూబ్ చానెల్ మీద తీవ్ర కేసులు పెడుతున్నారని అన్నారు.
పిల్లల శవాలు చూస్తుంటే తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకు వస్తున్నాయి. రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను బొంద పెట్టాలని చూస్తున్నాయి. కాంగ్రెస్,బీజేపీ ఎంపిలు ఎన్నడూ తెలంగాణ సమస్యల మీద పార్లమెంట్ లో మాట్లాడలేదు. ఎప్పుడూ తెలంగాణ కోసం కేంద్రాన్ని ప్రశ్నించింది గులాబీ సైనికులైన బి ఆర్ ఎస్ ఎంపిలు.సోనియా గాంధీ కి రాసిన లేఖ మీద రిప్లై వస్తుందని అనుకోవట్లేదు..అయినా బలి దేవత రిప్లై ఇస్తదా అని అడిగారు. సీతక్క కు డెప్యూటీ సీఎం ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళ అయిన సీతక్క కు డెప్యూటీ సీఎం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. అనుభవరాహిత్యం,అవగాహన లోపం తో సీఎం రేవంత్ పాలన ఉన్నది. అట్లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన ఖర్మ. లిక్కర్ కేసు...పెద్ద కేసు కాదు. కేసును టివి సీరియల్ కేసు లెక్క లాగుతున్నారు...నాకు కూడా పెద్ద ఇంటరెస్ట్ లేదు..మా లీగల్ టీం దాన్ని చూసుకుంటుంది. నేను బాధితురాలిని...ఫైట్ చేస్తా. ఆదర్శ్ కుంభకోణం ఏమైందని ప్రశ్నించారు.

Related Posts