YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప నగరంలో కిడ్నాప్ కలకలం

కడప నగరంలో కిడ్నాప్ కలకలం

కడప
కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేపింది. హైద్రాబాద్ నుంచి వస్తున్న ఖలీల్ నగర్ కు చెందిన ఇలియాజ్ అనే యువకుడిని ఆటో లో దుండగులు కిడ్నాప్ చేసారు. ఆటో లో కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారని ఇలియాజ్ తల్లిదండ్రులు ఆరోపించారు. నిన్న ఇలియాజ్ కు చెందిన కారును ఇంటి దగ్గర నుంచి దొంగతనం చేశారని వారు తెలిపారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆరోపించారు. తమ కొడుకుని కాపాడాలని వేడుకుంటున్నారు. డిఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకుని ఆవేదన వ్యక్తం చేసారు.
తరువాత ఇలియాజ్ తిరిగి  రావడంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు. కడప నగరంలో 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం తనను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారని ఇలియజ్  ఆరోపించారు. ఆటోలో కొట్టుకుంటూ ఎత్తుకెళ్లి బంగారు దోచుకెళ్లినట్టు బాధితుడు ఇలియాజ్ తెలిపారు. దుబాయ్ నుండి తన కష్టార్జితంతో తెచ్చుకున్న బంగారను తనను బెదిరించి లాక్కోని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.  తన పేరుతో బంగారు కొనుగోలు చేసిన బిల్లులు సైతం ఉన్నాయని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.

Related Posts