YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

టీఎస్ పీఎస్సీ.. ఏటా జాబ్ క్యాలెండర్

 టీఎస్ పీఎస్సీ.. ఏటా జాబ్ క్యాలెండర్

హైదరాబాద్, మార్చి 9
తెలంగాణలో నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్త. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ తరహాలో నిర్ణీత కాలవ్యవధితో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఏటా జనవరి 1న టీఎస్‌పీఎస్సీ, గురుకుల, పోలీసు, వైద్య నియామక బోర్డులు, సంస్థల ఆధ్వర్యంలో జాబ్‌ క్యాలెండర్లు ప్రకటించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా సర్కారు షురూ చేసింది.గ్రూప్-1, 2, 3, 4లతో పాటు అన్ని విభాగాల్లో నిరంతరం ఉద్యోగాల ప్రకటనలు వెలువరించడం వల్ల పరీక్షలకు ఉద్యోగార్థులు ప్రణాళికాబద్ధంగా సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్రస్థాయి ముసాయిదా జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధమవుతోంది. దీన్ని త్వరలోనే ప్రభుత్వానికి పంపించనుంది. సర్కార్ అనుమతించిన వెంటనే ఈ ఏడాది నుంచి జాబ్‌ క్యాలెండర్‌ అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరహాలో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్‌ క్యాలెండర్‌ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏటా జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో నోటిఫికేషన్ ఇస్తారు? ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి? నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందన్న అంశాలకు స్పష్టమైన గడువు ఉంటుంది. ఆ గడువులోగా నియామకాలు పూర్తవుతాయి. ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను కమిషన్ తీసుకుంటోంది. సర్వీసు నిబంధనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం, ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుంటోంది. జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే టీఎస్‌పీఎస్సీతో పాటు పోలీసు, గురుకుల, వైద్యారోగ్య నియామక బోర్డుల నుంచి నిరంతర ఉద్యోగ ప్రకటనలు వెలువడుతాయి.తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త వచ్చింది. నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్స సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్ 1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్ష తేదీలను బుధవారం నాడు టీఎస్ పీఎస్సీ ప్రకటిచింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ జూన్ 9న నిర్వహించనున్నారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 న ప్రారంభం కానున్నాయి.
పొస్టులపై  ఆర్ధిక శాఖ వివరణ కోరిన ప్రభుత్వం
 తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో గ్రూప్-2, 3 ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరగనుంది. గతంలో ప్రకటించిన పోస్టులకు అదనంగా మరిన్ని ఖాళీలు చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ విభాగాల వారీగా ప్రస్తుతం ఉన్న, వచ్చే ఏడాదిలోగా ఏర్పడనున్న ఖాళీలను గుర్తించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెంటనే అందించాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈమేరకు విభాగాధిపతులకు లేఖ రాశారు. ఈ ఏడాదిలో జరగనున్న గ్రూప్-2, 3 పోస్టుల రాతపరీక్షలకు ముందుగానే అదనపు ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని, పోస్టుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్లు ఉద్యోగార్థులు భావిస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ 2022లో విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మొత్తం 783 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు రాతపరీక్షల తేదీలు గతేడాది నుంచి మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇక గ్రూప్-3లో 1388 పోస్టులకు ఈ ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ షెడ్యూలు ఖరారు చేసింది. ప్రస్తుత నోటిఫికేషన్లలోనే ఉద్యోగాల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరీక్షలు జరిగే వరకు పోస్టుల సంఖ్యలో మార్పులు చేర్పులకు అవకాశాలున్నట్లు కమిషన్, ప్రభుత్వం భావిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎదురయ్యే న్యాయసమస్యలపై సమాలోచనలు జరుపుతున్నాయి. ఈక్రమంలో వచ్చే ఏడాదిలోగా ఏర్పడనున్న ఖాళీలతో పాటు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తే వచ్చే అదనంగా వచ్చే పోస్టులపైనా కసరత్తు జరుగుతోంది.

Related Posts