YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆస్ట్రేలియాలో మృతి చెందిన బెజవాడ డాక్టర్

ఆస్ట్రేలియాలో మృతి చెందిన బెజవాడ డాక్టర్

విజయవాడ, మార్చి 9
కృష్ణా జిల్లాకు చెందిన ఓ యువ వైద్యురాలు ఆస్ట్రేలియాలో ప్రమాదవశాత్తు మృతి చెందడం తీవ్ర విషాదం నింపింది. ఉంగుటూరుకు చెందిన వైద్యురాలు వేమూరు ఉజ్వల (23) ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ లోని బాండ్ విశ్వ విద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. ఈ నెల 2న స్నేహితులతో కలిసి సరదాగా ట్రెక్కింగ్ వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు చేరవేశారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయారు. ఉజ్వల తనకు ఇష్టమైన విభాగంలో పీజీ చేసి ఉన్నత స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని.. ఇంతలోనే ఇలా మృత్యువు కబళించిందని ఆవేదన వ్యక్తం చేశారు.గన్నవరంలోని స్వగ్రామానికి వైద్యురాలు ఉజ్వల మృతదేహం శనివారం చేరుకుంది. ఈ క్రమంలో ఆమె పార్థివ దేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ఉంగుటూరు మండలం ఎలుకపాడులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Related Posts