కాకినాడ
కాకినాడలో అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కొందరు భాష చాలా ఎబ్బెట్టుగా,వెటకారంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలు దురదృవశాత్తు సాహిత్యాన్ని ప్రోత్సహించడం లేదు. ఓనమాలు మాత్రమే నేర్చుకొంటే తెలుగు ఆనవాళ్లు ఉండవు. ఉప రాష్ట్రపతి అయిన తర్వాత రెస్ట్ తీసుకునే అవకాశం వచ్చింది. 45 ఏళ్ళు విరామం లేకుండా రాజకీయాలు చేశాను. మాతృ భాష తల్లి లాంటిది. తెలుగు శతకాలు అలవాటు చేస్తే పిల్లలు బాగుపడతారు. తెలుగుబాష మరిచిపోతే మనకి ఉనికి ఉండదు... చివరికి న్యూస్ పేపర్లు.. తెలుగు న్యూస్ ఛానల్ కూడ ఉండవు. పిల్లలకు చిన్నప్పుడు నుండి తెలుగు పదాలు.. వేమన శతకాలు.. పెద్దబాలశిక్ష.. నేర్పించాలని అన్నారు.