YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

30 ప్లస్ 8... ఇదేనా... షేరింగ్ ఫార్ములానా

30 ప్లస్ 8... ఇదేనా... షేరింగ్ ఫార్ములానా

విజయవాడ, మార్చి 11
పొత్తు కుదిరింది.. లోగో మారింది.. ట్వీట్లు పోటెత్తాయి.. మాటలు పదునెక్కాయి..మరి సీటు షేరింగ్‌ పరిస్థితి ఏంటి? పవర్‌ షేరింగ్‌ ఫార్ములా ఏంటి? దీనికి నేతలు సమాధానాలు చెబుతారా? మూడు పార్టీలు ముందు ఓ ఒప్పందానికి వచ్చాయి. పొత్తు పెట్టుకుందామని చేతులు కలిపాయి. ఎన్టీఏలోకి చంద్రబాబును ఆహ్వానించింది కమలం పార్టీ. అటు పవన్‌ కల్యాణ్‌ ఎలాగూ ఎన్డీఏలోనే ఉన్నారు. ఇప్పుడు కూటమి సెట్‌ అయింది చంద్రబాబు ముందుగా ప్రతిపాదించినట్లు 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్‌ స్థానాలపైన మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. అయితే బీజేపీ కోరినట్లు ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలిచ్చేందుకు జనసేనాని పవన్‌ ఒక సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. గతంలో మూడు పార్లమెంట్‌ స్థానాలను తీసుకున్న జనసేన.. బీజేపీ కోసం ఒక సీటును వదులుకుని రెండు సీట్లతో సరి పెట్టుకునేందుకు అంగీకరించింది. ఇలా మూడు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో చంద్రబాబు, పవన్‌ ఢిల్లీ టూర్‌ సక్సెస్‌ అయినట్లు చెబుతున్నారు. ఇప్పుడు అసలు తంతు ఉంది. ఇప్పటికే 99 సీట్లకు అభ్యర్థులను ప్రకటించుకున్నారు టీడీపీ, జనసేన అధినేతలు.అయితే తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరింది. మిగిలిన సీట్లలో ఎన్ని వారికి కేటాయిస్తారనేది తేలాల్సిన విషయం. ప్రస్తుతానికి బీజేపీ జనసేనకు కలిపి 30 అసెంబ్లీ 8 ఎంపీ సీట్లు షేర్‌ చేసుకోబోతున్నట్లు కూటమి వర్గాలంటున్నాయి. జనసేన 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలకు ఒప్పుకున్నట్లు ముందే ప్రకటించుకుంది కాబట్టి.. బీజేపీకి ఆరు అసెంబ్లీ, ఐదు ఎంపీ సీట్లు ఇస్తారా..? లేక ఈ లెక్కలో మార్పులుంటాయా అనేది నేడో రేపో తేలబోతోంది.సీటు షేరింగ్‌ ఓకే.. మరి పవర్‌ షేరింగ్‌ ఫార్ములా ఉందా? మూడు పార్టీలున్నాయి కాబట్టి.. సీఎం పదవిని పంచుకుంటారా? మంత్రివర్గంలో బెర్తుల షేరింగ్‌ ఉంటుందా? ఎలా అనేది చూడాలి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మూడు పార్టీల కూటమిని ఒకసారి చూస్తే.. శివసేన నుంచి సీఎం పదవి, బీజేపీ, ఎన్సీపీ డిప్యూటీ సీఎం పదవులను షేర్‌ చేసుకున్నాయి. ఏపీలోనూ అదే ఫార్ములాని వర్తింపజేసే అవకాశం ఉంది. అయితే కూటమిలో పవన్‌ని ఎలా సంతృప్తిపర్చగలరనేదే ఆసక్తికరంగా మారింది. ఇటీవల జనసేన ప్రకటించిన సీట్లలో పవన్‌ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై క్లారిటీ రాలేదు. దీనికి కారణం ఏంటనేది అభిమానులను కన్ఫ్యూజన్‌లో పడేసింది.ఇదిలావుంటే పొత్తులో ఎక్కువగా కోల్పోతున్నది పవన్‌ కల్యాణే. ఎందుకంటే లోకల్‌ పార్టీగా తక్కువ ఎమ్మెల్యే సీట్లు. కూటమి కారణంగా బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వదులుకోవాల్సి వస్తోంది. మరి పవన్‌ పరిస్థితి ఏంటి? ఆయన పోటీ భీమవరం నుంచా, పిఠాపురమా? తిరుపతా? ఎక్కడి నుంచి దిగుతారనేది ఇంకా తేలలేదు. ఇప్పుడు కూటమి కన్ఫామ్‌ అయింది కాబట్టి.. పవన్‌ని ఎంపీగా పోటీ చేయిస్తే.. ఏపీలో ఫలితం ఎలా ఉన్నా.. కేంద్రంలో బీజేపీ వస్తే సెంట్రల్‌ మినిస్టర్‌ పదవి పక్కా అనేది మరో ఆప్షన్‌ కింద ఉంది.కూటమి ముందున్న మరో సవాల్‌ తెలంగాణలో పోటీ ఎలా? ఎన్డీఏ అంటే ఒక రాష్ట్రానికే పరిమితం కాదు కదా? గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన – బీజేపీ పొత్తుతోనే తెలంగాణలో బరిలోకి దిగాయి. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూడా కలిసింది కాబట్టి.. తెలంగాణలో టీడీపీకి కేడర్‌ బలం కూడా ఉంది కావున.. ఇక్కడ ఎన్డీఏ కూటమి పోటీ చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఖమ్మంలో టీడీపీ ప్రభావం చూపించే చాన్సులున్నాయి. మల్కాజ్‌గిరి, మెదక్‌ సెగ్మెంట్లలోనూ టీడీపీకి పట్టుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఇక్కడ కూటమి కోసం ఒత్తిడి చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీన్ని ముందుగానే పసిగట్టిన తెలంగాణ సీఎం రేవంత్‌ బీజేపీకి 400 సీట్లు గెలిచే సత్తా ఉంటే పొత్తులు ఎందుకంటూ ఫస్ట్‌ పంచ్‌ వదిలారు. పొత్తులో ఇన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పార్టీల అధినేతలు ఇవాళ కాకపోయిన రేపైనా సమాధానాలు చెప్పాల్సిందే..!

Related Posts