విజయవాడ, మార్చి 11
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులు కొలిక్కి వచ్చాయి. అధికారిక ప్రకటన వచ్చింది. సీట్ల షేరింగ్ కూడా పూర్తయింది. అంతాస్మూత్ గా వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుంది. పొత్తులు ఉంటాయని క్లారిటీ వచ్చినప్పటి నుంచి ఏపీ అధికార పార్టీ నేతలు విమర్శలు ప్రారంభించారు. అంతకు ముందు బీజేపీ ఈ రెండు పార్టీలకు షాక్ ఇచ్చిందని.. కలిసేందుకు సిద్దపడలేదని వైసీపీ నేతలు అనుకున్నారు. చంద్రబాబు గతంలో ఢిల్లీకి వెళ్లిన సమయంలో సీఎం జగన్ కూడా వెళ్లి మోదీతో సమావేశమయ్యారు. ఆ సమావేశ ఎజెండా...తాను ఏకపక్షంగా మద్దతుగా ఉంటానని.. టీడీపీని కూటమిలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పడమేనని ఎక్కువ మంది భావించారు. అది నిజమో కాదో తెలియదు కానీ అధికారికంగా టీడీపీ కూటమిలో చేరిపోయింది. ఏపీలో ఎన్డీఏ కూటమిపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించడం ప్రారంభించేశారు. ఎంతమంది గుంపులుగుంపులుగా వచ్చినా వైసీపీని ఏమీ చేయలేరని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో వైసీపీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నిరాశ, నిస్పృహలో ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలన్నీ తమ ఓటమి భయాన్ని కప్పిపుచ్చునే ప్రయత్నాలేనని, ఈసారి వైసీపీ గెలుపుపై ఆ పార్టీ నేతల్లో కూడా అనేక సందేహాలు ఉన్నాయని టీడీరపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. గెలవడం కష్టం కనుకనే
బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఢిల్లీలో పడిగాపులు కాస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దాదాపుగా ప్రతీ రోజూ విమర్శిస్తూనే ఉన్నారు. దమ్ముంటే ఒంటరిగా రావాలని సవాల్ చేస్తూ వ్సతున్నారు. వైసీపీ ఆరోపణలుకాస్త విచిత్రంగా ఉంటాయి. ఒకవైపు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తూనే మరోవైపు కాంగ్రెస్‌ను కూడా తన చెప్పుచేతల్లో ఉంచుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ పీసీసీ వైఎస్ షర్మిలారెడ్డి తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా కాకుండా చంద్రబాబు చెప్పినట్లుగా రాజకీయం చేస్తున్నారని సజ్జల అంటున్నారు. అదెలా సాధ్యమా అన్నది పక్కన పెడితే.. ఒక్క షర్మిల విషయంలోనేకాదు.. వైఎస్ వివేకా హత్య కేసులో ఏదైనా పరిణామం సంభవించినా.. దానికి కారణం చంద్రబాబే అంటున్నారు. కడప, పులివెందులలో వైఎస్ కుటుంబసభ్యులు ఎవరు .. ఏ పార్టీ తరపునపోటీ చేయాలన్నది కూడా చంద్రబాబే నిర్దారిస్తున్నారని గతంలోనేసజ్జల ఆరోపించారు. ఇలా తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతీ పరిణామం చంద్రబాబే అని చెప్పడం వల్ల ఎంత పొలిటికల్ మైలేజీ వస్తుందో కానీ.. వైసీపీ మాత్రం ఒత్తిడిలో ఉన్న అభిప్రాయం మాత్రం అంతా పెరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఎంత బలంగా ఉందో మిగతా అన్ని పార్టీలు ఏకమవడం ద్వారానే తెలుస్తోందని వైసీపీ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సింగిల్‌గానే వస్తారని, పొత్తులంటూ గుంపులు గుంపులుగా రారని వైసీపీ నేతలంటున్నారు. అయితే వైసీపీతో కలిసే పార్టీనే ప్రస్తుతానికి ఏదీ లేదు. అయితే దమ్ముంటే ఒంటరిగా రండి అని వారే్ చాలెంజ్ చేస్తున్నారు. ఇలాంటి చాలెంజ్ లోనే వారి భయం కనబడుతోందన్న సెటైర్లు టీడీపీ నేతలు వేస్తున్నారు. జనసేన-టీడీపీ-బీజేపీ పొత్తుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు భయానికి నిదర్శనంగా ఉన్నాయని అంటున్నారు. పొత్తు ఖరారు కాక ముందు నుంచే బీజేపీ-జనసేన-టీడీపీలపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఎన్నికల్లో ఓడిపోతామన్న వారి భయమే కనిపిస్తుందని అంటున్నారు. మూడు పార్టీలు కలిసి వస్తే వైసీపీ మూడు చెరువుల నీళ్లు తాగాల్సి వస్తుందని, అందుకే పొత్తును చూసి భయాందోళనలకు గురవుతూ తీవ్ర విమర్శలకు దిగుతున్నారని, ఈ విమర్శల ద్వారా వైసీపీ.. మేకపోతు గాంభీర్యం కనబరుస్తోందని వారంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ-జనసేన బలం పుంజుకోవడం, ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరుగుతుండటం వైసీపీ నేతలను కలవరపెడుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ ప్రాజెక్ట్‌ల విషయంలో భారీ సంఖ్యలో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు జాబ్ క్యాలెండ్ విడుద చేయకపోవడంపై నిరుద్యోగులు, జీతాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు, బిల్లుల అంశంపై కాంట్రాక్టర్లు కూడా వైసీపీకి వ్యతిరేకులుగా మారుతున్నారు. వాటన్నింటినీ గమనించే వైసీపీ నేతలు ఈ లేని ధైర్యాన్ని కనబరుస్తున్నారని, వైసీసీ హయాంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాలేదని, పెట్టుబడులు శూన్యంగా ఉన్నాయని, అప్పులు మాత్రం విపరీతంగా పెరిగాయని యువత ప్రశ్నిస్తున్నారు. అయితే అన్నింటినీ సంక్షేమ పథకాలు కవర్ చేస్తాయని.. పేదలంతా తమకే ఓటేస్తారని.. గట్టి నమ్మకంతో వైసీపీ నేతలు ఉన్నారు. వారిది నిజమైన నమ్మకమా.. మేకపోతు గాంభీర్యమా అన్నది వారికే తెలియాలి. బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని వైసీపీ అనుకుంది. దీనికి కారణం గత ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల తమకే ఎక్కువ లాభం కలిగిందని అంచనాకు రావడమే. అదే సమయంలో బీజేపీ అండ ఉంటే.. ఎన్నికల సంఘం చూసీ చూడనట్లుగా ఉంటుంది. అధికార పార్టీకి ఇది చాలా కీలకం.కానీ ఇప్పుడు ఎన్నికల సంఘం గత ఎన్నికల్లో చంద్రబాబు సర్కార్ తో ఆడుకున్నట్లుగా ఆడుకుంటే మొదటికే మోసం వస్తుంది. అదేఇప్పుడు గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. పార్టీ అభ్యర్థుల విషయంలో సీఎం జగన్ ఇప్పటికే గందరగోళంలో ఉన్నారు. అటూ ఇటూ మార్పులుచేస్తూ వస్తున్నారు.