YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అవినాష్ చుట్టూ వివేక కేసు

అవినాష్ చుట్టూ వివేక కేసు

కడప, మార్చి 11
పొలిటికల్ హీట్స్  ఎప్పుడో పీక్స్ కు చేరింది..ఏపీ ఎన్నికలలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది బహిరంగ రహస్యంగా మారిపోయిన తరుణంలో ఈ ఎన్నికలలో కడప లోక్ సభ స్థానంలో గెలుపు ఒక కేసులో ప్రజాతీర్పు ఎటువైపు ఉందన్న విషయాన్ని కూడా తేల్చేయనుంది. ఆ సీటు కడప లోక్ సభ స్థానం. ఆ స్థానంలో విజయం ద్వారా న్యాయస్థానాల తీర్పులతో పని లేకుండా వివేకా హత్య కేసులో నిందితులు, నేరస్తులు ఎవరు అన్న విషయంలో ప్రజల తీర్పు ఏమిటన్నది కూడా తేలిపోనున్నది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.. కారణాలేమైతేనేం అరెస్టు కాకుండా దర్జాగా బయట తిరుగుతున్నారు. ఇక ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తనకు ప్రాణభయం ఉంది మొర్రో అని మొరపెట్టుకుంటున్నారు. భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ కేసులో కీలక నిందితులు తనను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఫిర్యాదులూ చేస్తున్నారు.వివేకా హత్య జరిగిన నాటి నుంచీ ఈ కేసు దర్యాప్తులో అనేకానేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య జరిగిన వెంటనే ఎవరిమీదైతే అప్పటికి విపక్షంలో ఉన్న వైసీపీ అప్పటికి అధికారంలో ఉన్న తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించింది. అప్పటి విపక్ష నేత జగన్.. సొంత బాబాయ్ ని పొట్టన పెట్టుకున్నారంటూ శోనక్నాలు పెట్టి ప్రజా సానుభూతిని సంపాదించుకున్నారు. చివరికి ఆ సానుభూతే ఆయనకు అధికార పీఠవ తక్కేలా చేసింది. అయితే  తీరా అధికారంలోకి వచ్చాకా.. ఆరోపణలన్నీ రివర్స్ అయ్యాయి. అప్పట్లో జగన్ అండ్ కో అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ లపై వివేకా హత్య వెనుక వారి ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసిన  జగన్ అండ్ కో  ఆ తరువాత అంటే అధకారంలోకి వచ్చిన తరువాత తన ఆరోపణలను చాపచుట్టూసినట్లు చుట్టేసింది. అంతే కాదు విపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్ అండ్ కొ  అధికారం చేతికి వచ్చిన తరువాత స్వయంగా సీబీఐ దర్యాప్తు అవసరం లేదంటూ తన పిటిషన్ ను కూడా ఉపసంహరించుకుంది. ఆ తరువాత వైఎస్ వివేకా కుమార్తె పట్టుదలతో న్యాయం కోసం  సాగించిన అపుపెరుగని పోరాటం ఫలితంగా వివేకా హత్్ కేుసు సీబీఐ చేతికి వెళ్లింది. ఆ దర్యాప్తునకు అడుగడుగునా జగన్ తన అధికారాన్ని ఉపయోగించి అడ్డుకున్నారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులపై పులివెందులలో దాడి యత్నాలు జరిగాయి. హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడ్డారు. సీబీఐ అధికారులపైనే ఎదురు కేసులు నమోదయ్యాయి. దీంతో మళ్లీ మరోసారి వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించి మరీ కేసు విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అయ్యేలా చేశారు.మొత్తంగా ఈ కేసులో  సీబీఐ దర్యాప్తులో భాగంగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులెవరన్న విషయంలో జన బాహుళ్యంలో ఒక స్పష్టత వచ్చింది. ఇంటి దొంగలే వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్నారన్న అనుమానాలు నిరాధారమైనవేమీ కావన్న స్పష్టత వచ్చింది.    కడప లోక్ సభ అభ్యర్థి విషయంలో వచ్చిన విభేదాలే వివేకా హత్యకు మోటివ్ గా సీబీఐ దర్యాప్తు తేల్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సొంత కుటుంబ సభ్యులే దూరమయ్యారు. వివేకా కుమార్తె సునీత కూడా తన అన్న అధికారంలో ఉండగా తన తండ్రి హత్య కేసు తేలే అవకాశాలు లేవన్న నిర్ధారణకు వచ్చారు. అందుకే అన్నకు వ్యతిరేకంగా హస్తిన వేదికగా ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ పార్టీకి ఓటు వేయవద్దని ప్రజలకు విజ్ణప్తి చేశారు.  ఇప్పటికే ఎన్నో మలుపులు, అంతకి మించి కుదుపులు చోటు చేసుకున్న వివేకా హత్యకేసులో ప్రజా తీర్పు ఏమిటన్నది ఎన్నికలలో కడప లోక్ సభ నియోజకవర్గ ఫలితం తేల్చేస్తుందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ కేసులో మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష రాజకీయాలలో ప్రవేశించి ప్రజల మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు. దీంతో వివేకా హత్య కేసు క్లైమాక్స్ కు వచ్చేసినట్లూనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి, జగన్ మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలలో వివేకా హత్యకేసు కూడా ఒకటి .. ఇప్పుడు అదే హత్యకేసు అధికార వైసీపీ పుట్టి ముంచుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.  రాజకోట లాంటి ఇంట్లో అతి కిరాతకంగా జరిగిన ఈ హత్యను వారికి తగ్గట్లుగా మలుచుకున్న జగన్, ఆయన పార్టీకి ఇప్పుడు అదే హత్య కేసు రివర్స్ లో చుట్టుకుంది.   అప్పుడు వైసీపీ ఈ కేసును ఏ స్థాయిలో ఎన్నికల సమరంలో సానుభూతిని ఏరులై పారించిందో.. ఇప్పుడు  రివర్స్ లో జగన్, ఆయన పార్టీని  కోలుకోలేని విధంగా దెబ్బతీయబోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నిజానికి ఈ హత్య ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అనేది కోర్టులు, శిక్షలకే పరిమితం. కానీ, రాజకీయాలలో చేసే ఆరోపణలలో బలం ఎటువైపు ఉంటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు ఐదేళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలు అన్నీ కూడా  వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అందులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నాన్న కొడుకైన ఎంపీ అవినాష్ ఈ కేసులో కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సీబీఐ ఇప్పటికే తేల్చి చెప్పడం సీఎం జగన్ ను కోలుకోలేని విధంగా దెబ్బతీయనున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు, ఈ కేసులో అవినాష్ కాపాడేందుకు జగన్ తన సర్వశక్తులూ ఒడ్డడాన్ని జనం గమనించారని అంటున్నారు.    అందుకే నాడు జగన్ కు జనం సానుభూతిని తెచ్చిపెట్టిన వివేకా హత్య కేసే ఇప్పుడు ఆయనపై జనాగ్రహం అస్త్రంలా దూసుకు రావడానికి కారణమౌతుందంటున్నారు.

Related Posts