YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరీంనగర్ సెంటిమెంట్ ఫలిస్తుందా...

కరీంనగర్  సెంటిమెంట్ ఫలిస్తుందా...

కరీంనగర్, మార్చి 11,
శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నిరాశా నిస్పృహల్లోకి వెళ్లిన పార్టీ యంత్రాంగంలో జోష్‌ నింపేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమాయత్తమవుతు న్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం తుంటి ఎముక విరగడంతో ఆసుపత్రిలో చేరిన కేసీఆర్‌ ఇటీవలి కాలంలోనే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేఆర్‌ఎంబీ పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టు లను అప్పగించే ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నల్లగొండలో నిర్వహించిన బహిరంగసభకు మాజీ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా హాజరైన ఆయన తరువాత తెలంగాణ భవన్‌లో జరిగిన పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను గెలవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఇటీవల పార్టీ కార్యాలయంలో జరిగిన కరీంనగర్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల సమావే శంలో కరీంనగర్‌ వేదికగా భారీ బహిరంగసభకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు సమర శంఖారావం పూరిస్తూ ఈనెల 12న కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల ఆవరణలో లక్ష మందితో సభ నిర్వహించాలని నిర్ణయించారు.ఈ క్రమంలో మరోసారి పరీక్ష ఎదుర్కొంటున్న వేళ, బీఆర్ఎస్ పార్టీ తన పార్లమెంట్ ఎన్నికల శంఖారావానికి కరీంనగర్‌లోని ఎస్‌ఆర్ఆర్ మైదానాన్ని ఎంచుకుంది. మార్చి 12వ తేదీన గులాబీ బాస్ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఏం మాట్లాడబోతున్నారన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. మళ్లీ బీఆర్ఎస్ పునర్ వైభవం కోసం వచ్చే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ కరీంనగర్ ను వేదిక చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ సభను సక్సెస్ చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు నడుం బిగించాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు ఎస్ఆర్ఆర్‌లో సభా ఏర్పాట్లు పరిశీలించారు. నాటి టీఆర్ఎస్‌కు, నేటి బీఆర్ఎస్‌కు పార్టీ చరిత్రలో ఓ మైలురాయి. అంతేకాదు, 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మలి దశకు ఉపిరి పోసింది ఇక్కడే. ఆంధ్రాలో ఊపందుకున్న ఉద్యమంతో నాటి కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ యూటర్న్ తీసుకోవడంతో.. తెలంగాణాలో ఉద్యమం మరింత తీవ్రమైంది. కరీంనగర్ ఉత్తర తెలంగాణా భవన్ నుంచి సిద్ధిపేటకు బయల్దేరిన కేసిఆర్ ను.. కరీంనగర్ శివార్లలోని అల్గనూరు వద్ద పోలీసుల అరెస్ట్ చేయడం.. ఖమ్మం తరలించడం.. ఆసుపత్రిలో కూడా కేసీఆర్ తన ఆమరణ దీక్ష కొనసాగించడం వంటి ఎన్నో కీలక ఘట్టాలకు.. కరీంనగర్ సాక్షిభూతంగా నిల్చింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన.. ఉద్యమ నేత కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎం అవ్వడం బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో మరిచిపోలేని చరిత్ర.గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కాంగ్రెస్ అధికారం చేజిక్కించుకోవడంతో.. రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయిన మూడు నెలల వ్యవధిలోనే రాజకీయాలు వేగంగా మారుతున్నా యి. బీఆర్‌ఎస్‌ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచి నప్పటికీ, కొందరు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ముగ్గురు సిట్టింగ్‌ ఎంపీలు వెంకటేశ్‌ నేత (పెద్దపల్లి), పి.రాములు (నాగర్‌క ర్నూలు), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌) ఇప్పటికే వేరే పార్టీల్లోకి జంప్‌ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిట్టింగ్‌లు భయపడు తున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి పార్టీ అధిష్టానానికి సంకేతాలు ఇవ్వగా, మల్కాజిగిరి నుంచి తమ కుటుంబ సభ్యులెవరూ పోటీలో ఉండరని మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి శుక్రవారం కేటీఆర్‌ను కలిసి చెప్పారు. దీంతో పార్టీ బలంగా ఉందనే సంకేతాలు ఇచ్చేందుకు కరీంనగర్‌లో భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని నిర్ణయించారు. కరీంనగర్ సభతో మరింత దూకుడు పెంచాలని భావిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీజేపీతో ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది. కాంగ్రెస్ తమ అభ్యర్ధి ఎవరో ఇంకా ప్రకటిఃచని నేపథ్యంలో.. పోటీలో బీజేపీని ఢీకొనేలా ప్రణాళిక రచిస్తోంది. మరి సెంటిమెంట్ గా కలిసి వచ్చిన కరీంనగర్ గడ్డ ఈసారి బీఆర్ఎస్ కు ఎలాంటి ఫలితాన్ని రుచి చూపించబోతోందన్న ఎన్నో అంశాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Related Posts