YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రైతు బంధు... ఇక రైతు భరోసా

రైతు బంధు... ఇక రైతు భరోసా

హైదరాబాద్, మార్చి 11,
తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రైతు బంధు పథకం రైతు భరోసాగా మారబోతోంది. పేరు మారడంతోపాటు ఆర్థికసాయం కూడా పెరగనుంది. ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది. రైతులకు పెట్టబడి ఎంత అందనుంది అనే అంశాలపై ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటి వరకు నాలుగు పథకాలను ప్రారంభించారు. మహాలక్ష్మి గ్యాంరటీలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, రూ.500లకే ఎల్పీజీ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేస్తోంది.ప్రస్తుతం తెలంగాణలో రైతుబంధు పథకం అమలులో ఉంది. ఈ పథకం కింద గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడాదికి ఎకరాకు రూ.10 వేల సాయం అందించింది. దానినే ప్రస్తుత ప్రభుత్వం ఈ యాసంగిలో కొనసాగించింది. పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. వచ్చే వానాకాలం నుంచి రైతుబంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చనుంది. ఈ పథతకం కింద రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.15 వేలు అందించనున్నారు.రైతుభరోసా పథకాన్ని వచ్చే వానాకాలం నుంచే అమలు చేయాని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సాధారణంగా జూన్‌లో రుతుపవనాలు వచ్చిన తర్వాత వానాకాలం సాగు మొదలవుతుంది. ఆ సమయంలో రైతులకు పెట్టుబడి అందించాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. మరో విషయం ఏమిటంటే.. రైతుభరోసా కేవలం సాగు భూములకు మాత్రమే ఇవ్వనున్నారు. గత ప్రభుత్వం రైతుబంధు ద్వారా లక్షలాది అనర్హులకు కూడా రైతుబంధు ఇచ్చింది. సాగు చేయని గుట్టలు, కొండలు, రియల్‌ వెంచర్లకు కూడా రైతుబంధు ఇచ్చినట్లు గుర్తించారు. మరోవైపు ఆర్థికంగా ఉన్నవారికి రైతుబంధు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో అర్హులకే రైతుభరోసా ఇచ్చేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.తెలంగాణ రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు 2018లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది. భూమి ఉన్న ప్రతీ రైతుకు ఎకరాకు ఏటా రూ.10వేలు ఇచ్చారు. 2023, ఆగస్టు నాటికి 11 విడతల్లో రైతుబంధు పథకం కింద డబ్బులు అందించారు. గత వానాకాలం సీజన్‌ వరకు రూ.72,910 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా రైతుబంధును యాసంగిలో కొనసాగించింది.

Related Posts