YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నల్గోండ నుంచి బీజేపీ రమేష్ రెడ్డి...

నల్గోండ నుంచి బీజేపీ రమేష్ రెడ్డి...

నల్గోండ, మార్చి 11
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విజయంతో జోష్ మీద ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ కు తాజాగా బిగ్ షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికలలో నల్గొండ టికెట్ ఆశించి భంగపడిన పటేల్ రమేష్ రెడ్డి కమలం గూటికి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నల్గొండ జిల్లాలో బలమైన నేతల్లో ఒకరైన పటేల్ రమేష్ రెడ్డి పార్టీ మారాలన్న నిర్ణయం ఆ జిల్లాలో కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బంది కలిగించే విషయమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పార్టీలో ఓ విధమైన జోష్ కొనసాగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ రోజు రోజుకూ బలహీనపడటం, అదే సమయంలో పొరపొచ్చాలు లేకుండా కాంగ్రెస్ టీమ్ తెలంగాణలా పని చేయడంతో వచ్చే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తుందన్న అంచనాలు కూడా పెరిగాయి. పలు సర్వేలు కూడా అదే విషయాన్ని వెల్లడించాయి. అయితే పంటి కింద రాయిలా నల్గొండ లోక్ సభ స్థానం కోసం పోటీలో ఉన్న నేతల సంఖ్య ఎక్కువ కావడం, అలాగే ఆ టికెట్ ఆశిస్తున్న ఆశావహులంతా బలమైన నేతలే కావడం కాంగ్రెస్ కు చిక్కుగా మారింది.అసెంబ్లీ ఎన్నికలలో సూర్యాపేట టికెట్ ఆశించిన పటేల్ రమేష్ రెడ్డికి టికెట్ దక్కలేదు. అయితే అప్పట్లో  పార్టీ హై కమాండ్ ఆయనను లోక్ సభ ఎన్నికలలో నల్గొండ నుంచి దింపుతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే తీరా లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో అధిష్ఠానం మళ్లీ పటేల్ రమేష్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చింది. నల్గొండ నుంచి లోక్ సభకు పోటీ చేసేందుకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో పటేల్ రమేష్ రెడ్డి ఇక కాంగ్రెస్ తో లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పటేల్ రమేష్ రెడ్డి బీజేపీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయన బీజేపీతో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. బీజేపీ కూడా పటేల్ రమేష్ రెడ్డి వంటి కీలక నేత పార్టీలో చేరితే నల్గొండలో పార్టీ బలోపేతమౌతుందని భావిస్తోందని అంటున్నారు. అందుకే ఆయన చేరికనున బీజేపీ స్వాగతిస్తున్నదని చెబుతున్నారు.పటేల్ రమేష్ రెడ్డి పార్టీలో చేరితే ఆయనను నల్గొండ నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు  బీజేపీ రెడీగా ఉందని అంటున్నారు. ఇక పటేల్ రమేష్ రెడ్డి కూడా తన అనుచరులతో ఈ విషయమై జోరుగా చర్చిస్తున్నారనీ, నేడో రేపో ఆయన కమలం గూటికి చేరే అవకాశాలే మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు

Related Posts