YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజన్న సన్నిధీలో కానరాని భోజన సదుపాయం

రాజన్న  సన్నిధీలో కానరాని భోజన సదుపాయం

సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శాశ్వత కళ్యాణం, నిత్య కళ్యాణాలు చేసుకున్న భక్తులకు సరైన భోజన సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆలయ అధికారులు చెబుతున్నా అది ఆచరణలో సాధ్యం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేములవాడ రాజన్న సన్నిధిలో ఐదు వేల రూపాయలు చెల్లిస్తే 10 సంవత్సరాల పాటు శాశ్వత కళ్యాణం చేసుకుని సదుపాయం కల్పించింది. అలాగే 1500 రూపాయలు చెల్లించిన భక్తులకు నిత్యకళ్యాణం చేసుకోవచ్చు. వీరికి దేవాలయం తరఫున ఐదుగురికి అన్నదానం కల్పిస్తుంది. వీరి కోసం నిత్య అన్నదాన కొరకు అన్న సత్రం పైన  20లక్షల రూపాయలతో రేకుల షెడ్డు, టేబుల్స్, ఆహార పదార్థాలు పైకి తీసుకురావడానికి లిఫ్ట్ ఏర్పాటు చేశారు. సత్రంలో భోజనం చేసే వారికి మినరల్ వాటర్ ప్లాంట్ ను సైతం ఏర్పరచినా వినియోగంలోకి చేయకపోవడంతో తుప్పు పట్టి ఉండడంతో భక్తులకు బోరు బావి నీళ్ళు తాగుతున్నారు. ఈ నిర్మాణాలు రెండు సంవత్సరాల కిందట పూర్తయిన కూడా నేటికీ అమలుకు నోచుకోక పోవడంతో  షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. దేవాలయంలో కళ్యాణం చేసుకున్న భక్తులు ఎంతో పవిత్రంగా భోజనాలు చేద్దామనుకునే వారికి నిరాశే ఎదురవుతుంది. ఇప్పటికైనా ఆలయ అధికారులు వెంటనే కళ్యాణాలు చేసుకున్న  భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలం లోనే భోజన సదుపాయం కల్పించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Related Posts