YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రోడ్డపై ఇసుక లారీల తిష్ట…ప్రయాణికులకు ఇబ్బందులు

రోడ్డపై ఇసుక లారీల తిష్ట…ప్రయాణికులకు ఇబ్బందులు

జయశంకర్ భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో ఇసుక లారీ డ్రైవర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. దాంతో వాహనదారులు  నిత్య నరకం ఎదుర్కుంటున్నారు. జాతీయ రహదారిపై ఇరు వైపుల వేలాది ఇసుక లారీలు నిలుపుతున్నారు. మహదేవపూర్ మండలం కాళేశ్వరం మార్గంలో రోడ్డంతా ఇసుక లారీలు ఆక్రమించాయి. సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ఇసుక లారీలను నిలిపి సాధారణ వాహనదారుల పై దురుసుగా ఇసుక లారీ డ్రైవర్లు ప్రవర్తిస్తున్నారు.అధికారులు మాత్రం ఎన్ని పిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని స్థానికులుఆరోపిస్తున్నారు.

Related Posts