YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సైబర్ మోసాలపై అవగాహనా సదస్సు

సైబర్ మోసాలపై అవగాహనా సదస్సు

రామగుండం
ఎన్టీపీపీ జ్యోతీనగర్ లోని ఎస్బీఊ  బ్యాంకు లో లో సైబర్  నేరాలపై, సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్స్పెక్టర్ కృష్ణ మూర్తి ఆధ్వర్యంలో అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు,  క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ ఫ్రాడ్స్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ ఫ్రేడ్స్ లోన్ యాప్ ల, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ల గురించి, www. cybercrime. gov.in, సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు.  ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై  అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని తెలిపారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా https://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని బ్యాంక్ కస్టమర్ లకు సూచించారు.  అవగాహన కార్యక్రమంలో  హెడ్ కానిస్టేబుల్ అట్టెం. శంకర్, కానిస్టేబుల్స్, డీ. శ్రీనివాస్, నిమ్మతి శ్రీని వాసు  పాల్గొన్నారు.

Related Posts