YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ అస్త్రం

చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్ అస్త్రం

విజయవాడ, మార్చి 13,
రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో అధికార వైసిపి అడుగులు వేస్తోంది. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వార్ డిక్లేర్ చేస్తే.. వై నాట్ పులివెందుల అంటూ తెలుగుదేశం పార్టీ జనసేన కూడా యుద్ధానికి సిద్ధం అంటోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు గేర్పే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో వైసిపి ముఖ్య నేతలు అస్త్ర, శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు ఎన్నికల వ్యూహాలను రచించుకుంటూనే.. మరోవైపు సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. గత కొన్నాళ్ల నుంచి రాజకీయంగా కీలక పదవులను అనుభవించిన ఎంతోమంది నేతలు.. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాబితాలో వైసీపీకి చెందిన సీనియర్ నేతలు ఉండడం గమనార్హం. వైసీపీలో సీనియర్ నేతలుగా చలామణి అవుతున్న పలువురు రానున్న ఎన్నికలు నేపథ్యంలో సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవే తమ చివరి ఎన్నికలు అంటూ ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. చివరి ఎన్నికలు అని చెబుతున్న వారిలో సీనియర్ నేతలు ఉండడం గమనార్హం. ఈ జాబితాలో సీనియర్ మంత్రులుగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన కొడాలి నాని ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదివారం కళింగ కోమట్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు రానున్న ఎన్నికలే చివరివని, మరోసారి అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఈ ఎన్నికల్లోనే తాను రిటైర్ కావాలని భావించాలని, జగన్, తన కుమారుడి ఒత్తిడితోనే పోటీలోకి మళ్ళీ దిగుతున్నట్లు పేర్కొన్న ధర్మాన.. వచ్చే ఎన్నికల నాటికి తాను రాజకీయాల్లో ఉండనని స్పష్టం చేశారు. పార్టీ కష్ట కాలంలో వదిలేసాను అన్న అపవాదు తనపై రాకూడదు అన్న ఉద్దేశంతోనే పోటీ చేస్తున్నట్లు వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో వైశ్యుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశానని, చివరిసారిగా తనకు మరొక అవకాశాన్ని ఇవ్వాలని ఈ సందర్భంగా ధర్మాన విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజకీయాల్లో కొనసాగడం పై ధర్మాన చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఇదే తరహాలో మాట్లాడడం గమనార్హం. సోమవారం సాయంత్రం విశాఖలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స.. తనకు రానున్న ఎన్నికలే చివరివని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగం ఉన్నట్లు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఓటమి భయం ఉన్నవారే తరచూ నియోజకవర్గాలు మారుతారు అంటూ గంటాపై సెటైర్లు విసిరిన మంత్రి బొత్స.. 2029 ఎన్నికల నాటికి మాత్రం పోటీలో ఉండబోనని స్పష్టం చేశారు. వయసు పైబడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరుగాంచిన కొడాలి నాని కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. గడిచిన నాలుగు ఎన్నికల్లో విజయాలు సాధిస్తూ వస్తున్న కొడాలి నాని.. వచ్చే ఎన్నికల్లోను విజయమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు 53 ఏళ్లు వచ్చాయని, 2029 నాటికి 58 ఏళ్లు వస్తాయన్నారు. 58 ఏళ్ల వయసులో పోటీ చేయలేమని, ఈ ఎన్నికల తనకి చివరవని స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైసీపీ నేతలు చేస్తున్న తాజా వ్యాఖ్యలు.. రాజకీయంగా సెంటిమెంట్ రగిలించేందుకే చేస్తున్నారా, లేక నిజంగానే ఎన్నికల బరిలో నుంచి తప్పించుకునే ఉద్దేశంతోనే అంటున్నారా అన్నది ఆ నేతలకే తెలియాల్సి ఉంది. వైసిపి ముఖ్య నేతలు ఈ తరహా ప్రకటనలు పట్ల టిడిపి, జనసేన నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.రలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచే పోటీచేస్తున్నానని మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలే తనకు చివరివన్నారు.. ఆ తర్వాత తన కుమారుడు పోటీ చేస్తారన్నారు. నగరంలోని పేదలకు ఇంటిస్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. దీంతో ఆయన ఒంగోలు వచ్చిన బాలినేనికి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో పేదలందరికీ పట్టాలు ఇచ్చాక ఒంగోలు నుంచి పోటీచేస్తానని లేకపోతే చేయబోనని ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.నగర పాలక సంస్థ పరిధిలో వెంగముక్కలపాలెం, ఎన్‌.అగ్రహారం ప్రాంతాల్లో రైతుల నుంచి భూసేకరణ చేస్తున్నట్లు చెప్పారు బాలినేని. అందుకోసం గతంలో రూ.30కోట్లు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.180 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వచ్చే నెల 10వ తేదీలోపు 25వేల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. గతంలో ఒంగోలు నుంచి ఎంపీగా మాగుంట, ఎమ్మెల్యేగా తాను పోటీచేస్తానని చెప్పానని.. మాగుంట సీటు విషయంలో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. బాలినేని ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.

Related Posts