YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న రోగులు

సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న రోగులు

భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆసుపత్రిని మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరం తరలించి ఆ ఆసుపత్రి స్థానంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను గత కొద్ది ఏళ్ల క్రితం మంజూరు చేశారు. కానీ సిహెచ్సికి సరిపడా భవనాలను నిర్మించలేదు సరిపడా వైద్య సిబ్బందిని కూడా నియమించకపోవడం వల్ల ప్రస్తుతం సీమాంగ్ సెంటర్ భవనంలోనే అక్కడి వైద్య సిబ్బందితోనే వైద్య సేవలను అందిస్తున్నారు.ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్యకు సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో రోగులు చికిత్స పొందడానికి వేచి చూడాల్సిన దుస్థితి దాపురించింది.ప్రస్తుతం చర్ల మండలంలో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్న కారణంగా మండల కేంద్రంలోని ఈ ఆసుపత్రికి రోజుకు సుమారు 200 పైగా రోగులు వస్తున్నారు.వీరిలో అత్యధిక శాతం రోగులు మారుమూల గిరిజన గ్రామాలనుంచే వస్తూఉంటారు వారికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో రోగులు 55 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం వెళ్తూ ఆర్ధికంగా నష్టపోతున్నారు.రోగ నిర్ధారణకు ఈ ఆసుపత్రిలో రక్త పరీక్షా కేంద్రం లేకపోవడం వల్ల మండల కేంద్రంలోని ప్రైవేటు రక్త పరీక్షా కేంద్రాలను ఆశ్రయించవలసి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి చర్ల మండల కేంద్రానికి మంజూరు చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు సరిపడినంత మంది డాక్టర్లను, వైద్య సిబ్బందిని, శానిటేషన్ కొరకు కిందిస్థాయి సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Related Posts