కిర్లంపూడి
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు శిరస్సు వంచి క్షమించమని కోరారు. ముద్రగడ వైసిపి లో చేరిక వాయిదా వేసారు. ఈనెల 14న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహనరెడ్డి పిలుపు మేరకు వై.యస్.ఆర్.సి.పి లో చేరేందుకు సిద్ధమైన ముద్రగడ, ఊహించిన దానికన్నా భారీస్థాయిలో స్పందన రావడంతో సెక్యూరిటి ఇబ్బంది వల్ల నిర్ణయం మార్చుకున్నారు. ఈ మేరకు ఒక లేఖ ను ముద్రగడ రాసారు. ఎక్కువమంది వస్తే కూర్చోడానికి కాదు, నిలబడడానికి కూడా స్థలం సరిపోదని,వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బందని చెప్పడంతో, తాడేపల్లికి భారీ ర్యాలీగా వెళ్ళే కార్యక్రమం రద్దు చేసుకున్నా. ప్రజల్ని నిరుత్సాహపర్చినందుకు మరొక సారి క్షమాపణ కోరుకుంటున్నానని అన్నారు.
ఈ నెల 15 లేక 16వ తేదీలలో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి సమక్షంలో పార్టీలోకి చేరతానని తెలిపారు.