దేశ రాజకీయాల్లో సరికొత్త శకం స్టార్టవుతోందా? మాజీ రాష్ట్రపతే ప్రధాని అయ్యే ఛాన్స్ ఉందా? విశ్వసనీయ రాజకీయ వర్గాలు ఇది అసాధ్యం కాదనే అంటున్నాయి. కాంగ్రెసేతర, బీజేపీయేతర ప్రధానిగా ప్రణబ్ రంగంలోకి దిగే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రణబ్ ముఖర్జీని, కాంగ్రెస్ పార్టీని వేరు చేసి చూడలేం. టోటల్ గా 50ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన మూడో కూటమికి నేతృత్వం వహిస్తే మాత్రం.. ఆ ఎఫెక్ట్ భారీగానే ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. విశిష్టమైన రాజకీయ అనుభవం ఉన్న ప్రణబ్ గనుక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే.. ఆయన ప్రభావం చూపగలరని విశ్లేషకులు అంటున్నారు. ప్రణబ్ కాంగ్రెస్ నేతే అయినప్పటికీ ఆయన అన్ని పార్టీలతోనూ సత్సంబంధాలే కొనసాగించారు. దీంతో ఆయన మాటకు విలువ ఇచ్చి.. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపైకి వచ్చే ఛాన్స్ ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రణబ్ ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ గనుక బలపడితే.. ఆ ఎఫెక్ట్ బీజేపీ, కాంగ్రెస్ లపై తీవ్రంగా ఉంటుంది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న ఆయన పరిణతితో దేశాన్ని లీడ్ చేయగలరన్న భావన ప్రజల్లో సహజంగానే వచ్చేస్తుంది. ఆయన రాష్ట్రపతిగా పోటీ చేసినప్పుడే పలు పార్టీలు అడక్కుండానే మద్దతుగా నిలిచాయి. విపక్షం ఎన్డీయే.. అయితే.. తమ తరపున అభ్యర్ధిని నిలబెట్టాలి అనుకుంది కాబట్టి నిలబెట్టింది. ఆయనపై పోటీకి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను దించుదామనీ అనుకుంది. అయితే.. ప్రణబ్ ను గౌరవించి ఆయన పోటీ చేయనని తేల్చి చెప్పేశారు. ఇంతటి ఇమేజ్ ఉన్న ప్రణబ్ మూడ్ కూటమికి ప్రాతినిథ్యం వహిస్తే.. ఆ ఎఫెక్ట్ కచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ లపై ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రజల్లో ఇప్పటికే అధికార బీజేపీ కొంత అప్రతిష్ట మూటగట్టుకుంది. ప్రధాని మోడీ ఇమేజ్ గ్రాఫ్ పడిపోవడం మొదలైంది. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రణబ్ నేతృత్వంలో మూడో ప్రత్యామ్నాయం వస్తే మాత్రం.. బీజేపీ, కాంగ్రెస్ లకు నష్టం వాటిల్లడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ప్రణబ్ కూటమిలో చేరేందుకు ఆయా పార్టీల నేతలు ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే.. బీజేపీ, కాంగ్రెస్ ల్లోని కీలక నేతలు థర్డ్ ఫ్రంట్ లో వాలినా పెద్దగా ఆశ్చర్యపోనవసంలేదన్నది విశ్లేషకుల మాట. రాజకీయంగా 50ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ప్రణబ్ ముఖర్జీ సొంతం. ఇక ఆయన కాంగ్రెస్ లో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచారు. పార్టీలోనే కాక పార్టీకే సమస్యలు, ఇబ్బందులు వచ్చినా.. తనదైన శైలిలో గట్టెక్కించేశేవారు. ఇలాంటి నేత ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ రూపుదిద్దుకుంటోందంటే జాతీయ స్థాయిలో తిష్టవేసిన మేజర్ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లను టెన్షన్ పెట్టే అంశమే. ప్రణబ్ దాదా నయా లీడర్ షిప్ పై ఇప్పటివరకైతే.. ఎలాంటి అధికార సమాచారం లేదు. ఈ సంగతి తేలాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే..