YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మై హోమ్ రామేశ్వరరావుపై కొరడా

మై హోమ్ రామేశ్వరరావుపై కొరడా

హైదరాబాద్, మార్చి 14,
మైహోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యంపై రేవంత్ స‌ర్కార్ లాఠీ ఝుళిపించింది. గత పదేళ్లుగా మేళ్లచెరువు గ్రామపంచాయతీ పరిధిలోని 150 ఎకరాల భూదాన్ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న భూదాన్ భూములను వెంటనే ఖాళీ చేయాలని రెవిన్యూ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ నోటీసులు జారీ చేశారు.  మేళ్లచెరువు రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057లో 160ఎకరాల భూదాన్ భూమి ఉన్నది.  ఇందులోని 113 ఎకరాల భూదాన్ భూమిని మైహోమ్ సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం, కీర్తి సిమెంట్ పరిశ్రమ 18.20ఎకరాలు, కీర్తి సిమెంట్స్ ఎండి జాస్త్రి త్రివేణి 21.20ఎకరాలు భూమిని ఆక్రమించారు. మరో ఇద్దరు రైతుల వద్ద 3.19ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఈ భూములపై గత పదేళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా మైహోమ్ సిమెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టింది. అనేక వివాదాలు తలెత్తాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో భూదాన్ భూములను ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. భూదాన్ భూముల కబ్జా వెనుక మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హస్తం ఉందని పెద్ద ఎత్తున చర్చ జరిగింది.ఈ నేపథ్యంలో రేవంత్ స‌ర్కార్ మేళ్లచెరువు గ్రామ రెవిన్యూ పరిధిని భూదాన్ భూముల ఆక్రమణ పై దృష్టి సారించింది. భూములను వెంటనే ఖాళీ చేయాలంటూ భూదాన్ గ్రామ్ దాన్ చట్టం సెక్షన్ 24A ద్వారా షోకాస్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు వివరణ ఇవ్వాల్సిందిగా ఈనెల 16న సీసీఎల్ఏ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.మై హోం రామేశ్వర్ రావు దోచుకున్న ప్రతి పైసాను తాను కక్కిస్తానంటోంది రేవంత్‌ స‌ర్కార్‌. మేళ్ల చెరువు కర్మాగారంలో అటవీ చట్టాన్ని పాటించకపోవడం, భూదాన్ భూములను ఆక్రమించుకోవడం, అన్ని చట్టాలను తుంగలో తొక్కి రామేశ్వర్ రావు అక్రమాలకు పాల్ప‌డ్డారు. మాజీ సిఎంతో క‌లిసి మై హోం రామేశ్వ‌ర్‌రావు 4 లక్షల కోట్ల దేశ సంప‌ద‌ను దోచుకున్నారన్నది ఆరోపణ

Related Posts