YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైకాపా, రాజకీయాలకు దూరం ఎమ్మెల్యే రక్షణ నిధి

వైకాపా, రాజకీయాలకు దూరం ఎమ్మెల్యే రక్షణ నిధి

తిరువూరు
తిరువూరు  ఎమ్మెల్యే-కొక్కిలిగడ్డ రక్షణనిధి మీడియాతో మాట్లాడారు. తిరువూరు నియోజకవర్గంలో  పదేళ్లు పాలన పూర్తయింది. తాను వచ్చిన వెంటనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. క్యాడర్ అందర్నీ ప్రజా ప్రతినిధులుగా చేశాం. మున్సిపల్ ఒడాం,పంచాయితీలు ఓటమి చూశాం,కానీ ఎమ్మెల్యే గా మాత్రం క్యాడర్ సహకారంతో గెలిచాం. ప్రతి పక్షంలో ఉన్నవారు సైతం మా గెలుపుతో భాగస్వామ్యం అయ్యారని అన్నారు. పార్టీ కార్యక్రమాల్ని తుచా తప్పకుండా చేశాం..క్యాడర్ ను బలోపేతం చేశాం. మున్సిపాలిటీనీ ఓన్ సైడ్ గా గెలిపించడం జరిగింది. 63 ఎంపీటీసీ లకు 61గెలిచాం, నాలుగు జడ్పీటీసిలను గెలవడం జరిగింది. తన సొంత నిధులతో పార్టీ కొరకు ఆర్థికంగా,అహర్నిశలు ఖర్చు చేశామని అన్నారు.
చైర్మన్ పీఠం మార్పు కోసం 16  మంది కౌన్సిలర్ల ఆమోదంతో మరొకరికి అవకాశం కల్పించేందుకు చూశాం.అధిష్టానం ఆదేశాలతో నిలిచిపోయింది. కష్టపడితేనే సీటు అన్నారు. ఎండ, వాన, చలి అనే తేడా లేకుండా ప్రతి గడప గడపకు కష్టపడ్డాను.. సీఎం జగన్ రివ్యూ పెట్టారు.  ప్రతి రివ్యూ లో మొదటి పది స్థానాల్లో నేను ఉన్నాను. 59% నన్నే కావాలని చేసిన సర్వేలలో తేలింది. అభ్యర్థి నేనే అని చెప్పారు..కానీ మళ్లీ సర్వే చేశారు. అసలు అభ్యర్థుల్లో పరిచయం లేని వారి పేర్లను ఐవిఆర్ఎస్ సర్వేల్లో పెట్టారు. అధిష్టానానికి విధేయుడుగా ఉన్న నన్ను ప్రక్కన పెట్టేందుకు మర్మం ఏమిటి..? పార్టీ నమ్ముకుని ఉన్న నన్ను ఐపాక్ రిపోర్ట్ ఫాలో అవుతున్నా అని  అధిష్టానం చెప్పింది. ఐప్యాక్  సర్వేల్లో నేనే మొదటి స్థానంలో మరి దానిని ఎందుకు పరిగణలోకి ఎందుకు తీసుకోలేదు..నేను నేనుగా మానేశాను.. ప్రజలకు వివరణ ఇవ్వాలి కాబట్టి చెబుతున్నా. సామాజిక న్యాయం ద్వారా  అందరికీ పదవులు ఇచ్చాను, నాలా మరొకరు ఉండరు. ఎమ్మెల్యేగా నాపైనే సర్వే చేశారు సర్వే ఆధారం 69% కావాలని తేలింది. మిగతా వారికి 6% ఉందని అన్నారు. నేనుగా మాత్రమే పోటీ చేయడం లేదు, అంతే నాకు టికెట్ లేదని కాదు. నా మనస్సు గాయపడింది  అందుకే మౌనంగా ఉన్నా. వాస్తవాలు ప్రజలకు తెలియాలి అందుకే మీడియా సమావేశమని వివరణ ఇచ్చారు. 2014,19 ఎన్నికల్లో పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి  నాకు పూర్తిగా సహకరించారు. మేము ఏమైనా చెబుతాం అంటే  సీఎం జగన్ కలిసేందుకు అపాయింట్మెంట్ లేకుండా పోయింది. కేంద్రంలో ప్రధాని మోడీ బ్రహ్మాండంగా పాలన చేస్తున్నారు. ఆయనే రావాలని నేను కోరుకుంటున్నా. వైఎస్ఆర్ పార్టీ,రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని రక్షణ నిధి అన్నారు.

Related Posts